ఇది విన్నారా : అధిక బరువు వల్ల మరో పెను ప్రమాదంను కనిపెట్టిన శాస్త్రవేత్తలు

అధిక బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం తెల్సిందే.

ఇప్పటికే అధిక బరువు కారణంగా గుండె పోటు వస్తుందని ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్తలు తాజాగా అధికంగా కొలెస్ట్రాల్‌ పెరగడంతో పాటు, అనూహ్యంగా ఎక్కువ బరువు పెరిగే వారికి క్యాన్సర్‌ వాది సోకే అవకాశం ఉందని తేలింది.

గత కొన్నాళ్లుగా అనేక మంది శాస్త్రవేత్తలు నిర్వహించిన ప్రయోగాల్లో ఈ విషయాన్ని నిర్థారించారు.క్యాన్సర్‌ రీసెర్చ్‌ యూకే వారు నిర్వహించిన ప్రయోగంలో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.

ఉబకాయం బారిన పడ్డ వారిలో 0.8 శాతం మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లుగా తెలిసింది.2011లో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో ఉబకాయం 0.5గా ఉంది.ఈమద్య కాలంలో ఉబకాయం వల్ల క్యాన్సర్‌ బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరిగింది.

ఈ పరిణామం ఉబకాయస్తులకు భయాందోళనకు గురి చేస్తోంది.పెద్ద ఎత్తున ఈమద్య కాలంలో ఉబకాయస్తులు అవుతున్నారు.

Advertisement

తినే తిండి మరియు ఇతరత్ర కారణాల వల్ల లావు అధికంగా పెరుగడం వల్ల దాన్ని తగ్గించుకునే సమయం వారికి చిక్కడం లేదు.ఎంతగా ప్రయత్నించినా కూడా లావు తగ్గేందుకు కష్టపడలేక పోతున్నామని చాలా మంది అంటున్నారు.

లావు ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే కాకుండా, అధికంగా పొడవు ఉన్న వారు కూడా క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉందని వారు వెళ్లడిస్తున్నారు.క్యాన్సర్‌ కారకం ఎంత మేరకు మనషి జీవితంలో ప్రభావితం చేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రతి ఒక్కరికి క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉంది.

అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొద్దిలో కొద్దిగా అయినా క్యాన్సర్‌ను తప్పించుకునే అవకాశం ఉంది.అందుకే లావు మరీ ఎక్కువ కాకుండా ఉండేందుకు జాగ్రత్త పడండి.

తాజా వార్తలు