బీహార్ మాజీ సీఎం , రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది.దాణా స్కాం లో దోషిగా తేలిన ఆయన బిర్సా ముండా జైలు లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
అయితే లాలూ గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన రాంచీ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తుంది.
ఆయన మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని,దీంతో పాటు బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ సైతం నిలకడగా లేవని వైద్యులు అంటున్నారు.పశుగ్రాసం కుంభకోణంలో దోషిగా తేలడంతో 2017 నుంచి ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది అని ఆయనకు రిమ్స్ లో వైద్యం అందిస్తున్న డీకే ఝా తెలిపారు.
ప్రస్తుతం బ్లడ్ ఇన్‌పెక్షన్ లాలూ శరీరంలో వ్యాపించిందని, ఆయన కిడ్నీ 63 శాతం దెబ్బతినగా, 37 శాతం మాత్రమే సరిగా పనిచేస్తోందని డాక్టర్ ఝా తెలిపారు.

యాంటీబయోటిక్ మెడిసన్లు కారణంగా కూడా ఆయన కిడ్నీ పనితీరు మందగించిందన్నారు.లాలూ తీసుకునే డయిట్ కూడా గతంలో కంటే తగ్గిందని, ప్రస్తుతం మందులు ఇస్తున్నామని ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య బృందం తెలిపింది.