ఒక్క రోజు ముందుగానే రాబోతున్న భీమ్లా నాయక్‌.. అసలు కారణం ఆర్‌ఆర్‌ఆర్‌

పవన్ కళ్యాణ్ హీరో గా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా కొన్ని రోజుల క్రితం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా దాదాపు గా 200 కోట్ల వసూళ్లను సొంతం చేసుకొని పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ గా నిలిచిన విషయం తెలిసిందే.

 Pawan Bheemla Nayak Streaming One Day Before Due To Rrr Movie, Aha Ott, Bheemla-TeluguStop.com

ఇప్పుడు అదే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా డిజిటల్ ప్లాట్ ఫారం ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.మొదట ఈ సినిమా ను మార్చి 25 వ తారీఖున డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ని 24 వ తారీకున స్ట్రీమింగ్‌ కి సిద్ధం చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Telugu Aha Ott, Bheemla Nayak, Pawan, Rrr-Movie

మార్చి 25 వ తారీఖున టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది.ఆ సినిమా తో పాటు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వాలిమై సినిమా కూడా డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా విడుదలకు సిద్ధంగా ఉంది.కనుక భీమ్లా నాయక్‌ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు రోజే అంటే మార్చి 24 వ తారీకున విడుదల చేయడం ద్వారా అన్ని విధాలుగా కలిసి వస్తుందనే ఉద్దేశం తో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.కచ్చితంగా రాబోయే 24 మరియు 25వ తేదీ లు తెలుగు సినీ ప్రేమికులకు మరియు ప్రేక్షకులకు పండగ వాతావరణం తీసుకు వస్తాయి అనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

భీమ్లా నాయక్‌ సినిమా లో నిత్యా మీనన్‌ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube