మార్చి నెలలో ఈ తేదీన తిరుమలలో స్వామివారి ఊరేగింపు..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది.స్వామివారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి ఉన్నారు.

 Swami's Procession In Tirumala On This Date In The Month Of March , Tirumala ,-TeluguStop.com

సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది.శుక్రవారం రోజు స్వామివారిని దాదాపు 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 25 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా దాదాపు నాలుగున్నర కోట్లు ఆదాయం వచ్చినట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.

ఈ నెల 18వ తేదీన పదకవిత పితామహుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు తలపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి నిర్వహిస్తారు.శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమ భక్తుడైన అన్నమాచార్య 520వ వర్ధంతి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరుమలలో నిర్వహించనున్నారు.

Telugu Bakti, Devotees, Devotional, Srisrimalayappa, Srivenkateswara, Tirumala-L

సాయంత్రం 5:30 నిమిషములకు ఈ కార్యక్రమం మొదలవుతుంది.ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఊరేగించనున్నారు.సాయంత్రం ఐదు గంటల 30 నిమిషములకు శ్రీ శ్రీమలయప్ప స్వామి వారు ఊరేగింపుగా శ్రీవారి దేవాలయం నుంచి బయలుదేరుతారు.6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేస్తారు.ఆ తర్వాత ప్రముఖ కళాకారులతో దిన ద్వాదశి సంకీర్తనలు, సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు.

Telugu Bakti, Devotees, Devotional, Srisrimalayappa, Srivenkateswara, Tirumala-L

ఆ తర్వాత అహోబిలం శ్రీ లక్ష్మీనర సింహ స్వామి దేవస్థానం 46వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తారు.తాళ్లపాక వంశీయులకు సన్మానంతో ఈ కార్యక్రమం ముగిస్తుంది.అన్నమాచార్యుల వారి పద సంకీర్తనల తో తిరుమలగిరి ప్రతిధ్వనించనున్నాయి.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలను రచించిన పరమ భక్తుడు అన్నమయ్య.సాక్షాత్ శ్రీమహావిష్ణువు ఖడ్గమైనా నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని భక్తులు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube