గోవు ఏ భాగంలో ఏ దేవతలు కొలువై ఉంటారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు.కనుక దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తిశ్రద్ధలతో ఆవును పూజిస్తారు.

 Interesting Facts About Gomatha Puja Cow, Gomatha Pooja, Hindu Tradition, Gods,-TeluguStop.com

ఈ విధంగా ఆవును పూజించండానే గోపూజ అని పిలుస్తారు.మన పురాణాలలో గోపూజకు ఎంతో విశిష్టత ఉంది.

ఈ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని,గోవును పూజించడం వల్ల సకల దేవతలా ఆశీర్వాదం పొందవచ్చని భావిస్తారు.గోవును ఏ భాగంలో పూజించడం వల్ల ఏ దేవుడు ఆశీర్వాదం కలిగే ఎలాంటి ఫలితాలు పొందుతామో ఇక్కడ తెలుసుకుందాం.

గోక్షీరంలో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెపుతున్నాయి. అదేవిధంగా గోవు నుదురు కొమ్ముల భాగంలో పరమ శివుడు కొలువై ఉంటాడు.అందుకే ఆవు కొమ్మలపై చల్లిన నీటిని మనపై చల్లుకోవడం వల్ల త్రివేణి సంగమంలోని నీటిని మన తలపై చల్లినంత విశిష్టత లభిస్తుందని చెబుతారు.గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉంటాడు.

ఈ భాగాన్ని పూజిస్తే సంతానం లభిస్తుంది.ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారు.

వీరిని ఆరాధించడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయి.ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులు కొలువై ఉంటారు వీరిని పూజించడంవల్ల చీకటి అనే అజ్ఞానం నుంచి బయట పడవచ్చు.

Telugu Gods, Gomatha Pooja, Hindu-Telugu Bhakthi

ఆవు సంకరంలో సరస్వతి దేవి కొలువై ఉంటుంది.సరస్వతీ దేవిని పూజించడం ద్వారా విద్యా ప్రాప్తి కలుగుతుంది.ఆవు కుడివైపు చెక్కిలిలో యముడు, ఎడమవైపు చెక్కిలిలో ధర్మదేవతలు ఉంటారు.కనుక వీరిని పూజిస్తే యమ బాధలు తొలగిపోయి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి.కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెబుతారు.

ఇక ఆవు గిట్టలలో నాగ దేవతలు కొలువై ఉంటారు.గిట్టలను పూజించటం వల్ల నాగుపాము భయం ఉండదని చెబుతారు.

ఆవు వెనుక భాగంలో లక్ష్మి దేవి కొలువై ఉంటుందట, అక్కడ పూజించడం వల్ల లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది.ఈ విధంగా ఆవులో సకల దేవతలు కొలువై ఉండడం వల్ల ఆవుని ఎంతో పవిత్రంగా భావించి పూజ చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube