గోవు ఏ భాగంలో ఏ దేవతలు కొలువై ఉంటారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు.కనుక దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తిశ్రద్ధలతో ఆవును పూజిస్తారు.

ఈ విధంగా ఆవును పూజించండానే గోపూజ అని పిలుస్తారు.మన పురాణాలలో గోపూజకు ఎంతో విశిష్టత ఉంది.

ఈ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని,గోవును పూజించడం వల్ల సకల దేవతలా ఆశీర్వాదం పొందవచ్చని భావిస్తారు.

గోవును ఏ భాగంలో పూజించడం వల్ల ఏ దేవుడు ఆశీర్వాదం కలిగే ఎలాంటి ఫలితాలు పొందుతామో ఇక్కడ తెలుసుకుందాం.

గోక్షీరంలో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెపుతున్నాయి. అదేవిధంగా గోవు నుదురు కొమ్ముల భాగంలో పరమ శివుడు కొలువై ఉంటాడు.

అందుకే ఆవు కొమ్మలపై చల్లిన నీటిని మనపై చల్లుకోవడం వల్ల త్రివేణి సంగమంలోని నీటిని మన తలపై చల్లినంత విశిష్టత లభిస్తుందని చెబుతారు.

గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉంటాడు.ఈ భాగాన్ని పూజిస్తే సంతానం లభిస్తుంది.

ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారు.వీరిని ఆరాధించడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయి.

ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులు కొలువై ఉంటారు వీరిని పూజించడంవల్ల చీకటి అనే అజ్ఞానం నుంచి బయట పడవచ్చు.

"""/" / ఆవు సంకరంలో సరస్వతి దేవి కొలువై ఉంటుంది.సరస్వతీ దేవిని పూజించడం ద్వారా విద్యా ప్రాప్తి కలుగుతుంది.

ఆవు కుడివైపు చెక్కిలిలో యముడు, ఎడమవైపు చెక్కిలిలో ధర్మదేవతలు ఉంటారు.కనుక వీరిని పూజిస్తే యమ బాధలు తొలగిపోయి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.

ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి.కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెబుతారు.

ఇక ఆవు గిట్టలలో నాగ దేవతలు కొలువై ఉంటారు.గిట్టలను పూజించటం వల్ల నాగుపాము భయం ఉండదని చెబుతారు.

ఆవు వెనుక భాగంలో లక్ష్మి దేవి కొలువై ఉంటుందట, అక్కడ పూజించడం వల్ల లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది.

ఈ విధంగా ఆవులో సకల దేవతలు కొలువై ఉండడం వల్ల ఆవుని ఎంతో పవిత్రంగా భావించి పూజ చేస్తారు.

హెయిర్ బ్రేకేజ్ కు చెక్ పెట్టే బెస్ట్ అండ్ న్యాచురల్ టానిక్ ఇది.. డోంట్ మిస్!