ప్రస్తుతం సమాజంలో ఎంత మార్పు వచ్చినా కూడా చాలా రోజుల నుంచి వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు అసలు మారలేదు.ఇంకా వాటిని చాలామంది ప్రజలు పాటిస్తూనే ఉన్నారు.
ఇంట్లోకి లక్ష్మీదేవిని( Goddess Lakshmi ) ఆహ్వానించాలని ప్రయత్నించేవారు కొన్ని లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను కచ్చితంగా చేయాలి.లక్ష్మీదేవికి ఇష్టమైన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గురువింద గింజలు( Rosary pea ) లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.వీటిని గౌడియా వైష్ణవులు రాధా, రాణి పాద ముద్రలుగా పూజించేవారు.వీరు ఈ గింజలను సాలగ్రామ పూజ( Salagrama Puja )లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు.తమిళ సిద్ధులు గురువింద గింజలను పాలలో మరగబెట్టి ఇందులోని విష లక్షణాలను తగ్గించి అప్పుడు ఉపయోగించేవారు.
ఎదుటివారిని అవమానించే వారిని, గొప్పలకు పోయే వారిని ఈ గురువింద గింజలతో పెద్దలు పోల్చేవారు.ముఖ్యంగా చెప్పాలంటే పూర్వం రోజులలో ఈ గింజలతో బంగారాన్ని తూకం వేసేవారు.
బంగారం తూచి ఇన్ని గింజలు ఎత్తని చెప్పేవారు.అంతేకాకుండా గురువింద గింజల ఆకు తిన్న తర్వాత నోట్లో రాయిని వేసుకుని నమలడానికి చూస్తే అది సునాయాసంగా నలిగిపిండిగా మారిపోతుంది అని చెప్పేవారు.
దీపావళి సమయంలో ఈ గింజలను ఎనిమిది గాని 11 గాని తీసుకుని ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.అక్షయ తృతీయ రోజు కూడా ప్రత్యక్షంగా లక్ష్మీదేవిని వీటితో ఆరాధిస్తారు.
ఎర్రటి ఎరుపు రంగు వస్త్రంలో గురువింద గింజలను వేసి కుంకుమతో కలిపి బీరువాలో ఉంచితే ధన అభివృద్ధి ఉంటుంది.ఇందులో తెలుపు రంగు గింజలు శుక్ర దోష నివారణకు, ఎరుపు రంగు గింజలు కుజదోష నివారణకు, నలుపు రంగు గింజలు శని గ్రహ దోష నివారణకు, పసుపు రంగు గింజలను గురు గ్రహదోషా నివారణకు, ఆకుపచ్చ గింజలను బుధ గ్రహ దోష నివారణకు ఉపయోగిస్తూ ఉంటారు.ఆయా గ్రహ దోషాలు ఉన్నవారు గింజలను చేతికి కంకణాలుగా చేయించుకుని ధరిస్తూ ఉంటారు.ఇలా ధరించడం వల్ల గ్రహదోషాలే కాకుండా నరదృష్టి కూడా దూరమవుతుందని శాస్త్రాలలో ఉంది.