ఆకాశ దీపాన్ని ఎందుకు పెడతారో తెలుసా?

కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాలలో ధ్వజ స్థంబానికి ఆకాశ దీపం వ్రేలాడటం చూస్తూనే ఉంటాం.కార్తీక మాసం శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైనది.

 The Significance Of Aakasa Deepam-TeluguStop.com

ఆకాశ దీపాన్ని ఎలా వెలిగిస్తారంటే….చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు.

ఈ పాత్రను తాడు సాయంతో పైకి పంపించి, ధ్వజ స్తంభం పై భాగాన వేలాడదీస్తారు.ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు.

అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి ఒక కారణం వుంది.శాస్త్రం ప్రకారం ఆకాశ దీపం అనేది ఆకాశ మార్గాన ప్రయాణించే పితృ దేవతాల కోసం.‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు.కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు.ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

ఆకాశ దీపంలో నూనె పోయటం మరియు వెలిగిస్తే పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.కార్తీక మాసంలో నెల రోజుల పాటు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకొని వారి పాపాలకు విముక్తి కలిగించమని దేవుణ్ణి వేడుకుంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL