రంజాన్ మాసంలో మాజీ హాకీ ప్లేయర్ చేస్తున్న సేవలు ఇవే..

రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది.ముస్లింలు ఈ నెలలో మత సంప్రదాయాలను పాటిస్తారు.

 Former Hockey Player Umpire Akram Offering Sehri And Iftar , Hockey Player , Ra-TeluguStop.com

ఈ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉండటం ద్వారా అల్లాను ఆరాధిస్తారు.ఈ నెలలో మాజీ ప్రముఖ హాకీ ప్లేయర్ మరియు ఛత్తీస్‌గఢ్ అంపైర్, అక్రమ్( Akram ) ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

నౌమాన్ అక్రమ్ అర్హులకు, రెండుపూటలా తిండి దొరకని వారికి సెహ్రీ (సూర్యోదయానికి ముందు భోజనం) మరియు ఇఫ్తార్ (సూర్యాస్తమయం తర్వాత భోజనం) అందిస్తున్నారు.ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, అతను తన సహచర యువకుల బృందంతో కలిసి అలాంటి ఈ కార్యాన్ని చేపడుతున్నారు.

వారి కోసం ప్రతిరోజూ సెహ్రీ, ఇఫ్తార్‌లను అందిస్తున్నాడు.ఈ పవిత్ర కార్యం కోసం ఆయన ప్రభుత్వ ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాలను ఎంచుకున్నారు.

నిరుపేదలకు ఆహారం పంపిణీనౌమాన్ అక్రమ్ బృందం రాయ్‌పూర్‌లో ఈ సేవలు అందిస్తోంది.రంజాన్‌ మాసంలో స్థోమత లేనివారికి పగలు, రాత్రి కష్టపడి పనిచేసేవారికి సాయం అందిస్తున్నాడు.

అలాగే అక్రమ్ రంజాన్ ఉపవాసం ఉండే వారికి ఆహారం, నీరు/పానీయాలు మొదలైనవి అందజేస్తూ సహాయం చేస్తున్నాడు.

Telugu Akram, Devotional, Hockey, Iftar, Muslims, Ramzan, Sehri-General-Telugu

రాయ్‌పూర్ ఎయిమ్స్, డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ వంటి పెద్ద ఆసుపత్రులను సందర్శించి రోగులకు మరియు వారి కుటుంబాలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని ఆయన ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పాడు.ముస్లిం ఆచారాలను పాటిస్తున్నవారితో సంబాషిస్తూ వారికి సేవలు అందజేస్తున్నారు.నౌమాన్ అక్రమ్ బృందం ప్రతిరోజు ఫుడ్ ప్యాకెట్లు తయారుచేస్తుంది.

ఆసుపత్రులలోని పేద రోగులకు, వారితో పాటు వచ్చే సహాయకులకు పంపిణీ చేస్తున్నారు.సామాజిక మాధ్యమాల ద్వారా సహాయం.

Telugu Akram, Devotional, Hockey, Iftar, Muslims, Ramzan, Sehri-General-Telugu

ఈ ఉదాత్తమైన పనిని చూసిన చాలామంది సహాయం కోసం అక్రమ్ సోషల్ మీడియా ద్వారా వివిధ ముస్లిం సమూహాల నుండి సహాయం కోరుతున్నారు.ఆసుపత్రుల్లో రోగుల బంధువులు లేదా బస్ టెర్మినల్స్ వద్ద ప్రయాణికులు అర్ధరాత్రి తర్వాత తినడానికి ఏమీ దొరకడం లేదని వారికి తెలియజేస్తున్నారు.అందుకే తెల్లవారుజామున 3 గంటల వరకు నిత్యం ఆహరం తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.సెహ్రీ మెనూలో సాధారణంగా చపాతీలు, గుడ్డు కూర లేదా భుర్జీ, బిర్యానీ మరియు పండ్లు ఉంటాయి.

అదేవిధంగా, ఇఫ్తార్ ఆహారంలో ఖర్జూరం, పండ్లు, సమోసాలు, జ్యూస్‌లు మొదలైనవి ఉంటాయి.ఆయన సేవాకార్యక్రమాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఏది ఏమైనప్పటికీ, రంజాన్ మాసం ప్రాముఖ్యత ఏమిటంటే, ఇతరుల పట్ల దయ చూపడం, పేదల పట్ల శ్రద్ధ, సానుభూతి వహిస్తూ మెలగడం చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube