యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. నరసింహ నామస్మరణలతో ప్రతిధ్వనించిన దేవాలయం..

యాదాద్రి శ్రీ నరసింహ స్వామి దేవాలయానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.సెలవు రోజులు కావడంతో దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

 Devotees Crowd At Yadadri Temple Details, Devotees Crowd ,yadadri Temple, Yadagi-TeluguStop.com

ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి కార్లు, బస్సులు, ప్రత్యేక వాహనాలలో అధిక సంఖ్యలో భక్తులు రావడం విశేషం.దీనివల్ల ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటలు ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుందని భక్తులు వెల్లడించారు.

భక్తులతో దేవాలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి.

లక్ష్మీనరసింహ నామస్మరణతో యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనించాయి.

ప్రసాదం కౌంటర్లు, నిత్య కళ్యాణం,కొండ కింద, కళ్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల సందడి ఏర్పడింది.అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పోలీసులు ప్రత్యేక కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

పార్కింగ్ స్థలంలో రద్దీ దృష్ట ప్రయాణికులు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

యాదాద్రి క్షేత్రం అభిర్భానికి మూలమైన యాదవ మహర్షి పెరిట యద ఋషి నిలయం నిర్మించారు.రాష్ట్ర ప్రభుత్వ సహకారం సీఎం కేసీఆర్ సంకల్పంతో పుణ్యక్షేత్ర అభివృద్ధికి పాటుపడుతున్న వై టి డి ఏ మూడు కోట్లతో తీర్చిదిద్దింది.ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కుటీరం మధ్యన సమావేశ మందిరం, కిచెన్, డైనింగ్ హాల్, నాలుగు సూట్లు ఉంటాయి.

పరిసరాల్లో యాదవ మహర్షి శిలా విగ్రహాన్ని కూడా సిద్ధం చేసి ఉంచారు.

అక్కడి నుంచి యాదాద్రిశుల ఆలయం యాదగిరిగుట్ట పట్టణం, పాత గుట్ట, భువనగిరి జిల్లాను చూడవచ్చు.ఈ కుటీరాన్ని వై టి డి ఏ క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తామని ఆ సంస్థ వైస్ చైర్మన్ రావు వెల్లడించారు.సెలవు రోజులు కావడంతో చాలా ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజామున నుంచే దేవాలయానికి అధిక సంఖ్యలో రావడం వల్ల దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube