ఆంధ్ర నాయకుడు, ఆంధ్ర మహావిష్ణువు, ఆంధ్ర వల్లభుడు ఇంకా ఎన్నో పేర్లతో భక్తుల పూజలు అందుకుంటున్న అత్యంత మహిమగల దైవం శ్రీకాకుళేశ్వర స్వామి.ఈయన కలియుగంలో పాప భారం తగ్గించేందుకు ఆవిర్భవిస్తాడని పండితులు చెబుతున్నారు.
ఈ స్వామి కొలువైన కోవెలకు చరిత్రకంగానూ, పౌరాణికంగానూ ఎంతో ప్రాధాన్యం ఉంది.సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం ( Srikakulam )గ్రామంలో శ్రీకాకుళేశ్వరుడిగా అవతరించాడని పురాణాలలో ఉంది.
ఇంకా చెప్పాలంటే వైష్ణవులకు అత్యంత పుణ్యప్రదమైన 108 క్షేత్రాలలో ఈ క్షేత్రం 57వ దని పండితులు చెబుతున్నారు.
కలియుగంలో పాపం పెరుగుతుందని భయపడిన దేవతలంతా ఆ బ్రహ్మతో కలిసి భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో విష్ణువు దర్శనానికై తపస్సు మొదలుపెట్టారు.వీరి తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షం కాగా,మేము తపస్సు చేసిన ఈ ప్రదేశంలోనే కొలువై భక్తుల పాపాలను హరించాలని కోరగా ఆయన సరే అని వరం ఇచ్చాడు.దీంతో బ్రహ్మ స్వయంగా శ్రీమహా విష్ణువును అక్కడ ప్రతిష్టించాడని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నాటికే ఇక్కడ దేవాలయం ఉండేది.అయితే ఒక రోజు దేవాలయంలోని మూలమూర్తి కనిపించకుండా పోయింది.
ముఖ్యంగా చెప్పాలంటే వెయ్యేళ్ల తర్వాత ఆ దారిన కంచి యాత్రకు పోతున్న ఒరిస్సా పాలకుడైన అంగపాళుడి ప్రధాని నరసింహ వర్మ( Narasimha Varma ) ఇక్కడ బస చేశాడు.అప్పుడు ఈ మాయమైన విగ్రహం సంగతి విని అక్కడి గ్రామాలన్నీ వెతకగా, చివరికి స్వామి అతని కలలో కనిపించి వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటి పెరడులో ఉన్నానని చెప్పారట.అక్కడ ఆ విగ్రహం దొరికిందని అదే నేటికీ ఇక్కడ పూజలు అందుకుంటుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.శ్రీకృష్ణదేవరాయలు ఒక సారి ఈ ప్రాంతానికి వచ్చి శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువు( Lord vishnu )ని దర్శించుకుని రాత్రికి అక్కడే బస చేశారు.
అయితే ఆ రాత్రి స్వామి ఆయనకు కలలో కనిపించి తెలుగు కావ్యాన్ని రచించమనగా దేవాలయంలో ఆగ్నేయంగా ఉన్న 16 స్తంభాల మండపంలో కూర్చుని ఆముక్త మాల్యద రచన చేశారు.దాంతో ఈ మండపానికి ఆముక్తమాల్యద మండపం అని పేరు వచ్చింది.