బుల్లి తెరపై మేల్ యాంకర్స్ లో ప్రదీప్ తర్వాత అత్యంత ఆధరణ, క్రేజ్ ఉన్న యాకర్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు రవి.ప్రస్తుతం బుల్లి తెరపై యాంకర్స్ గా అదరగొడుతున్న ప్రదీప్ మరియు యాంకర్స్‌కు యూత్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

ప్రదీప్ ఎప్పటికప్పుడు పెళ్లి అంటూ మీడియాలో ఉంటూ ఉంటాడు.ఇక రవి కూడా లాస్యతో లవ్, ఆ తర్వాత శ్రీముఖితో ప్రేమ విషయమై రకరకాలుగా ప్రచారం జరిగింది.లాస్య పెళ్లి జరుగుతున్న సమయంలో యాంకర్ రవి సోషల్ మీడియాలో తానేదో కోల్పోయినట్లుగా చాలా బాధను వ్యక్తం చేశాడు.దాంతో లాస్యతో రవి డీప్ లవ్‌లో ఉన్నాడని ప్రచారం జరిగింది.

పెళ్లి అయిన రవి తన భార్యకు విడాకులు ఇచ్చి మరీ లాస్యను వివాహం చేసుకునేందుకు సిద్దం అయినట్లుగా వార్తలు వచ్చాయి.అయితే అసలు తనకు పెళ్లే కాలేదు అన్నట్లుగా రవి బిల్డప్ ఇచ్చాడు.పెళ్లి అయ్యిందని ఎప్పుడు బయటకు చెప్పని రవి తాజాగా ఉన్నట్లుండి కూతురుతో సహా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.సోషల్ మీడియాలో తాజాగా రవి తన భార్య మరియు కూతురుకు సంబంధించిన పిక్స్‌ను పెట్టాడు.
ఎట్టకేలకు రవి పెళ్లి అయ్యిందా కాలేదా అనే సస్పెన్స్‌కు తెరపడింది.

రవి ఇన్నాళ్లు పెళ్లి అయ్యిందనే విషయాన్ని చెప్పక పోవడానికి కారణం ఏంటో తెలియదు.కాని సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అమ్మాయిల్లో క్రేజ్ కోసం రవి పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచి ఉంటాడని, ప్రదీప్‌లాగే తాను కూడా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ కోసం ప్రయత్నించాడని అంటున్నారు.
ఇక చివరకు రవి తన పెళ్లి విషయాన్ని రివీల్ చేయాల్సి వచ్చింది.ఇప్పుడు రవి తన మాజీ కో యాంకర్ అయిన లాస్య గురించి ఎలా స్పందిస్తాడనేది చూడాలి.







