నోటి మాటతోనే టెండర్ పనులు అప్పగించిన మంత్రి నారాయణ!

ప్రజావేదికను తమకు కేటాయించాలి అని కోరుతూ ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి తోలి లేఖను రాసిన సంగతి తెలిసిందే.

జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత బాబు తోలి లేఖను సీఎం కు అందించారు.

అయితే బాబు లేఖను పక్కన పెట్టిన జగన్ సర్కార్ ఎలాంటి ఆలస్యం చేయకుండా ప్రజావేదికను ఖాళీ చేయాలి అని తెలిపి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ ప్రజావేదిక నిర్మాణంలో అవినీతి జరిగిందా లేదా అన్న దానిపై సీఆర్డీఏ విచారణ చేపట్టింది.

ఈ విచారణ లో భాగంగా ప్రజావేదిక నిర్మాణ విషయంలో అవినీతి జరిగింది అంటూ సీఆర్డీఏ తన నివేదికలో వెల్లడించింది.

గత ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక నిర్మాణానికి సంబంధించిన వివరాలపై ప్రస్తుత ప్రభుత్వం సూచన మేరకు సీఆర్‌డీఏ ఈ నివేదిక అందించింది.

మున్సిప‌ల్, ప‌ట్టాణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సీఆర్‌డీఏ అధికారులు నివేదిక అందజేయగా, ఆ నివేదిక లో ప్రజావేదిక నిర్మాణ విషయంలో అవకతవకలు జరిగాయని, తమ అనుమతి లేకుండానే ఈ నిర్మాణం జరిపినట్టు ఆ నివేదికలో సీఆర్‌డీఏ స్పష్టం చేసింది.

అంతేకాకుండా అంచనాలను కూడా తారుమారు చేశారని,రూ.5 కోట్ల అంచనాలను 8.

90 కోట్ల మార్చేసినట్టు సీఆర్డీఏ స్పష్టం చేసింది. """/"/ కృష్ణానది కరకట్టలో నిర్మాణానికి అనుమతి నిరాకరించినప్పటికీ అప్పటి మంత్రి నారాయణ నోటి మాటతో టెండర్లు లేకుండానే పనులను అప్పగించి ఈ నిర్మాణం చేపట్టినట్లు సీఆర్డీఏ తన నివేదికలో వెల్లడించింది.

ఇప్పటికే ప్రజావేదిక స్వాధీనం చేసుకోవడం పై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తమకు ఎలాంటి గడువు ఇవ్వకుండానే ఈ విధంగా ప్రజావేదిక లాక్కోవడం మంచి నిర్ణయం కాదంటూ నేతలు మండిపడుతున్నారు.

అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ ప్రజావేదిక నిర్మాణం అవినీతి అనేది జరిగింది అంటూ సీఆర్డీఏ తన నివేదికలో తెలపడం తో ఇప్పుడు ఇరు పార్టీల మధ్య ఎలాంటి మాటల యుద్ధం చోటుచేసుకుంటుందో చూడాలి.

గోళ్లు దృఢంగా పొడుగ్గా పెరగాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!