ఈ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు దొరకడం అనేది అసాధ్యంగా మారింది.ఈ నేపథ్యంలో కొందరు నిరుద్యోగులు తమకు తామే స్వయంగా ఉపాధిని( Self Employment ) ఏర్పరచుకుంటున్నారు.
వారు సొంత ప్రతిభతో ఉద్యోగాలలో సంపాదించే దానికి పది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు.ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా,( Mahabubabad ) కురవి మండలం, స్టేషన్ గుండ్రాతిమడుగు గ్రామానికి చెందిన రాజేష్( Rajesh ) అనే గ్రాడ్యుయేట్ కూడా ఉద్యోగాల కోసం ట్రై చేసి విసిగిపోయాడు.
చివరికి వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా తమ గ్రామంలో ఉన్న మామిడి తోటను లీజుకు తీసుకొని అందులో జాతి కోళ్లను పెంచడం స్టార్ట్ చేశాడు.
ఈ కోళ్ల పెంపకం కోసం రెండేళ్లలో 6 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.కాగా ఆ కోళ్లను అమ్మగా అతనికి 15 లక్షలు డబ్బులు వచ్చాయి.దీని అర్థం కేవలం 2 ఏళ్లలో అతడికి ఏకంగా తొమ్మిది లక్షల లాభం వచ్చింది.ఈ రోజుల్లో ఏ ఉద్యోగం చేసినా రెండు ఏళ్లలో ఇంత మొత్తంలో డబ్బులు వెనకేసుకోవడం కష్టం.
కానీ వ్యాపారాల్లో లాభాలు చాలా అధికంగా ఉంటాయని రాజేష్ కథే నిదర్శనంగా నిలుస్తోంది.

గ్రాడ్యుయేట్ రాజేష్ ఒక్కొక్క కోడిపిల్లను 12 నెలలపాటు పెంచుతాడు.అందుకు అతనికి ఏడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.తర్వాత అతను ఒక్కో కోడిపై మూడు, నాలుగు వేల రూపాయల లాభం చూసుకొని అమ్ముతున్నాడు.
ఒకప్పుడు ఉపాధి దొరకక ఎంతో కష్టపడిన ఈ గ్రాడ్యుయేట్ ఇప్పుడు తనతో పాటు ఐదుగురికి జీవనోపాధి అందించే స్థాయికి ఎదిగాడు.చదువుకి తగ్గ ఉద్యోగం దొరకకపోయినా తాను చేస్తున్న పనిలో తనకు సంతృప్తి లభిస్తోందని అంటున్నాడు.

ఇకపోతే రాజేష్ ప్రస్తుతం మామిడి తోటలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన పెరు జాతితో పాటు ఆషిల్, కాకి, నెమలి, డేగ, పచ్చ కాకి, రసంగి, మైల, స్వేతంగి జాతులను పెంచుతున్నాడు.మొత్తంగా 15 రకాల జాతి కోళ్లను పెంచుతూ మంచి ఉపాధిని ఏర్పరచుకున్నాడు.అలాగే నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.రాజేష్ దగ్గరికి కోళ్లను కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా భారీగా కస్టమర్లు రావడం గమనార్హం.