నాగ చైతన్య( Naga chaitanya ) మరియు సమంత సుదీర్ఘ కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.కొన్ని కారణాల వల్ల విడి పోయి ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు.
ఇద్దరు కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా చేయడం వారి వారి అభిమానులకు ఆనందం కలిగించింది.సమంత చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఆమె నటించిన మరో వెబ్ సిరీస్ సిటాడెల్ మాత్రం ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.అదే సమయంలో నాగ చైతన్య నటించిన ధూత వెబ్ సిరీస్( Dhootha Web-Series ) విషయం లో కూడా అదే పరిస్థితి మొన్నటి వరకు ఉంది.
సమంత ప్రధాన పాత్ర లో నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ను ఇప్పటి వరకు విడుదల చేసే తేదీ ని ప్రకటించలేదు.కానీ నాగ చైతన్య వెబ్ సిరీస్ ధూత విషయం లో ఎట్టకేలకు అమెజాన్ వారు క్లారిటీ ఇచ్చారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సిటాడెల్ సిరీస్ ను మరింత ఆలస్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ధూత సిరీస్ ను డిసెంబర్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.విక్రమ్ కే( Vikram k ) కుమార్ దర్శకత్వం లో రూపొందిన ఈ సిరీస్ లో నాగ చైతన్య నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్య కాలం లో ఏ ఒక్క సినిమా లో లేదా సిరీస్ లో టచ్ చేయని కథ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు వెబ్ సిరీస్ ల్లో చైతూ వెబ్ సిరీస్ విషయం లో క్లారిటీ వచ్చింది… కానీ సమంత వెబ్ సిరీస్ ను ఎప్పటికి చూస్తాం అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.వచ్చే ఏడాది ఆరంభం లో అయినా సిటాడెల్ వస్తే బాగుండు కదా అన్నట్లుగా సమంత ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.