తెలంగాణ కేబినెట్ లో కీల‌క నిర్ణ‌యాలు

సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది.సుమారు ఐదు గంట‌ల పాటు సాగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

58 సంవ‌త్స‌రాలు నిండిన వారికి పెన్ష‌న్లు ఇవ్వాల‌న్న కేసీఆర్ నిర్ణ‌యానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.దీంతో ఈనెల 15 న రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప‌ది ల‌క్ష‌ల మందికి కొత్త‌గా పెన్ష‌న్లు అంద‌నున్నాయి.

అదేవిధంగా కోఠిలోని ఇఎన్టీ ఆస్ప‌త్రిని అధునాత‌న సౌక‌ర్యాల‌తో తీర్చిదిద్దుతూ ట‌వ‌ర్స్ ను ఏర్పాటు చేయాల‌ని కేబినెట్ తీర్మానించింది.స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన ఖైదీల‌ను విడుద‌ల చేయ‌ల‌న్న నిర్ణ‌యంపైనా కేబినెట్ చ‌ర్చించింది.

ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు 15 నాడు రాష్ట్రంలోని జైళ్ల‌లో ఉన్న ఖైదీల్లో 75 మంది ఖైదీల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది.అలానే స‌రోజినిదేవీ కంటి ఆసుప‌త్రిని కూడా ఆధునికీకరిస్తూ కొత్త భ‌వ‌న స‌ముదాయాన్ని నిర్మించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

Advertisement
సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్

తాజా వార్తలు