సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో..: సీఎం జగన్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu )పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

 Chandrababu Manifesto With Impossible Promises..: Cm Jagan , Cm Jagan, Chandrab-TeluguStop.com

సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో ఇచ్చారని సీఎం జగన్( CM Jagan ) మండిపడ్డారు.చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.

ఈ క్రమంలో చంద్రబాబును నమ్మడం అంటే మళ్లీ మోసపోవడమేనని పేర్కొన్నారు.అంతేకాకుండా చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగిసినట్లేనని చెప్పారు.

అయితే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా 99 శాతం హామీలను అమలు చేశామని తెలిపారు.

నాడు – నేడుతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్ ఆరో తరగతి నుంచే డిజిటల్ బోధన అందించామని పేర్కొన్నారు.8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్ లు అందించామన్నారు.గోరుముద్ద, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేశామన్నారు.

ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇచ్చామన్న సీఎం జగన్ ఐదేళ్లలోనే సుమారు రెండు లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.గతంలో ఎప్పుడు లేని విధంగా పాలన అందించామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube