ఈ సృష్టిలో అమ్మ ప్రేమను మించిన గొప్ప వరం మరొకటి లేదు.అమ్మ ప్రేమ గురించి, అమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
బిడ్డకు ఆపద వస్తుందని తెలిస్తే తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది తల్లి.అమ్మ ప్రేమను విలువ కట్టలేం.
అది మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా, పక్షుల్లో అయినా అమ్మ ప్రేమ ఒకేలాగా ఉంటుంది.అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అని అందరికి తెలిపే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయనే విషయం ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది.
వీడియో ప్రకారం ఒక తల్లి ఏనుగు నీటిలో కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగును కాపాడేందుకు తన శాయశక్తుల ప్రయత్నం చేసింది.
పాపం పిల్ల ఏనుగు నీటిలో కొట్టుకుపోతుంటే తల్లి ప్రాణం విలవిల్లాడిపోయింది.ఎలాగయినా తన బిడ్డను కాపాడుకోవాలని ఆ తల్లి ఏనుగు పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ నెటిజన్ పోస్ట్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఓ ఏనుగుల గుంపు కాల్వను దాటే క్రమంలో ఆ గుంపులోని ఒక పిల్ల ఏనుగు నీటి ప్రవాహానికి తట్టుకోలేక నీటిలో కొట్టుకు పోతుంది.
పిల్ల ఏనుగును గమనించిన తల్లి ఏనుగు తన తొండంతో ఆ ఏనుగు పిల్లను నీటి ప్రవాహం నుంచి అడ్డుకొనే ప్రయత్నం చేసింది.
అయితే అలా తల్లి ఏనుగు రెండుమూడు సార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది.
చివరికి తన శాయశక్తుల ప్రయత్నించి తన బిడ్డను నీటి ప్రవాహం నుంచి కాపాడి ఒడ్డుకు చేర్చింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఈ వీడియోను వారం రోజుల క్రితం పోస్టు చేయగా ఇప్పటిదాకా ఈ వీడియోను సుమారు రెండు లక్షల మంది చూసారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘అదీ.
అమ్మ ప్రేమంటే’ అని కామెంట్స్ పోస్ట్ చేస్తూ తల్లి ఏనుగును పొగిడేస్తున్నారు.







