ఆస్ట్రేలియాకు గూగుల్​ హెచ్చరిక.. ఎందుకంటే.. ?

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సై అంటే సై అంటూ ఢీ కొట్టడానికి సిద్దం అవుతుందట.దీనికి కారణం ఆస్ట్రేలియా న్యూస్ మీడియా చట్టాన్ని ప్రతిపాదించి త్వరలో దీని అమలుకు రంగం సిద్దం చేస్తుందట.

 Google-warning-to-australia Australia-google- Scott Morrison- Mel Silva-google-f-TeluguStop.com

అయితే ఈ ప్రతిపాదన చట్ట రూపం దాల్చినా, తమపై ఒత్తిడి చేసినా ఆస్ట్రేలియా లో సెర్చ్ ఇంజన్‌ను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది గూగుల్.అంతే కాదు ఇది మంచి చట్టం కాదని, మీరు గనుక ఇది అమలు చేస్తే దేశం విడిచి వెళ్లిపోతామని గూగుల్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ మెల్ సిల్వా కూడా హెచ్చరించారట.

కాగా ఈ వార్తలపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందిస్తూ, ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదని, మా దేశంలో ఎవరేం చేయాలో మేం నిర్ణయిస్తాం.ఇక్కడ ఉండాలంటే వాటి ప్రకారమే నడుచుకోవాలి.

పోతాం అని బెదిరిస్తే దానికి స్పందించాల్సిన అవసరం మాకు లేదు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారట.ఇదిలా ఉండగా గూగుల్, ఫేస్‌బుక్‌ స్థానిక వార్తా సంస్థలు ప్రచురించే వార్తలను ఊపయోగించుకుంటున్న క్రమంలో ఆయా వార్తా సంస్థలకు చెల్లింపుల విషయంలో ఓ నిర్దిష్ఠ ఒప్పందానికి రావాలని, అలా కాని పక్షంలో ప్రభుత్వ విభాగమే దీనిపై దృష్టి సారించి సరైన ధరను నిర్ణయిస్తుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనగా ఈ వివాదం రాజుకుందట.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube