ఇంట్లోనే పార్లర్ గ్లో పొందడానికి ఈ రెమెడీ ని ఫాలో అవ్వండి!

తమ స్కిన్ గ్లోయింగ్ గా మరియు బ్యూటిఫుల్ గా మెరుస్తూ కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.అందులో భాగంగానే కొందరు నెలకు ఒకటి లేదా రెండు సార్లు బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్, టాన్ రిమూవ్ తదితర ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు.

 Follow This Home Remedy For Parlour Glow At Home! Parlour Glow, Home Remedy, Ski-TeluguStop.com

ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పార్లర్ గ్లో పొందవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.మరి ఇంత‌కీ ఆ హోమ్‌ రెమెడీ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక చిన్న బంగాళదుంప(potato) తీసుకుని వాటర్ తో శుభ్రంగా క‌డిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక చిన్న టమాటోను(Tomato) కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న‌ బంగాళదుంప ముక్కలు, టమాటో ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి(Besan flour), రెండు టేబుల్ స్పూన్లు పెసర పిండి(Moong flour), వన్ టేబుల్ స్పూన్ పెరుగు(curd) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Shiny Skin, Skin Care, Skin Care Tips-Telugu Health

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని వారానికి రెండు సార్లు పాటించడం వల్ల చర్మంపై మురికి మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.మొండి మచ్చలు క్రమంగా మాయమవుతాయి.మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.స్కిన్ స్మూత్ అండ్ టైట్ గా మారుతుంది.

బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.మరియు స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా కూడా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube