రంది పెట్టు కోవద్దు.... ధైర్యంగా ఉండండి

మాది పేదవాళ్ళు, రైతుల సంక్షేమ ప్రభుత్వం మీరు బాగుంటేనే మేము, దేశం బాగుంటుంది సిఎం కేసిఆర్ మీద విశ్వాసం ఉంచండి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం.ఎకరాకు 10 వేల నష్ట పరిహారం అధికారులు మీ ఊరికే వచ్చి అందజేస్తారు.

 Don't Give Up Be Brave , B. Satya Prasad, N. Khemya Naik, Municipal Chair Person-TeluguStop.com

సిరిసిల్ల నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు మంత్రి కే టి ఆర్  ఓదార్పు,భరోసా రాజన్న సిరిసిల్ల జిల్లా:రైతులు రoది పెట్టుకోవద్దు .ఆందోళన చెందొద్దు.ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు( Kalvakuntla Tarakarama Rao ) అకాల వర్షాలు, వడగండ్ల వాన కు పంట నష్టపోయిన అన్నదాతలకు భరోసా ఇచ్చారు.జిల్లా లోని ముస్తాబాద్‌ మండలం గోపాలపల్లి గుంటపల్లి చెరువు తండా గ్రామాలు, వీర్నపల్లి మండల కేంద్రము లో క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని మంగళవారం మంత్రి స్వయంగా పరిశీలించారు.

ముస్తాబాద్ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రం సందర్శించి అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కుప్పలను మంత్రి పరిశీలించారు.రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు.

రైతులను ఓదార్చారు.అధైర్యపడొద్దని, కేసీఆర్‌పై నమ్మకం ఉంచాలన్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు.ఇప్పటికే పంట నష్టం వివరాలను అధికారులు నమోదు చేశారని మంత్రి రైతులకు తెలిపారు త్వరలోనే ప్రభుత్వ ప్రకటిత సహాయం రైతులకు వారి ఊరికే వచ్చి అధికారులు అందజేస్తారని తెలిపారు.

లావనీ పట్టా కలిగిన రైతులకు కూడా పంట నష్ట సహాయం అందుతుందన్నారు.మాది పేదవాళ్ల ప్రభుత్వం, రైతుల పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్న మంత్రి కే తారక రామారావు.

మీరు బాగుంటేనే మేము బాగుంటామని దేశం పచ్చగా ఉంటుందన్నారు.

దేశానికే అన్నం పెట్టే అన్నదాతలను  ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని పేర్కొన్నారు.

త్వరలోనే గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు లేని పేదలు తమకు ఉన్న 60-70 గజాల్లో ఇండ్లు నిర్మించుకుంటే మూడు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి తెలిపారు.ఇండ్ల జాగాలేని పేదలకు ఇంటి స్థలాలను కేటాయిస్తామని మంత్రి తెలిపారు.

అనంతరం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం స్టేట్ ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఇటీవల సీఎం కేసీఆర్‌ 5 జిల్లాలో స్వయంగా పర్యటించి స్వయంగా పంటలను పరిశీలించి, రైతులకు భరోసానిచ్చారన్నారు.

వడగళ్ల వానలు రైతుల నోటోమన్నుకొట్టాయని, పుష్కలంగా నీరుండడంతో సమృద్ధిగా పంట చేతికివచ్చిందన్నారు.తమ ప్రభుత్వం అంటేనే భారత రైతు సమితి అన్నారు.గ్రామీణ కష్టాలను తెలిసిన నేత కేసీఆర్‌ అని, ఇవాళ జలవనరులు పెరిగాయంటే కేసీఆర్‌ సంకల్పం వల్లే సాధ్యమైందన్నారు.రైతులకు కేసీఆర్‌ ( KCR )అండగా ఉంటారన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీ 13 మండలాల్లో 5 దఫాలుగా కురిసిన అకాల వర్షాలకు ఇప్పటి వరకూ 19వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఎకరానికి రూ.10వేల నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు.ఇంత పెద్ద మొత్తంలో పంట నష్ట పరిహారం అందించనున్న సర్కార్ మనదే నని అన్నారు .అకాల వర్షాలకు దెబ్బతిన్న రంగు మారిన మొలకెత్తిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి అభయమిచ్చారు.రాష్ట్రంలోని రైతులంతా విశ్వాసంతో ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు.స్వయంగా ముఖ్యమంత్రి రైతు కావడం ,గ్రామీణ ప్రాంతాల సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టే రైతుల సంక్షేమార్థం రైతుబంధు, రైతు బీమా వంటి  కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 65 వేల కోట్ల కోట్లను పంట పెట్టుబడి సహాయం రైతు బంధు కింద రైతుల ఖాతాలో జమ చేశారని 40 లక్షల మంది రైతులకు రైతు బీమా సౌకర్యాన్ని కల్పించారని గుర్తు చేశారు.ఇప్పటికే ఏడున్నర లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేటీఆర్‌ తెలిపారు.

గత సంవత్సరం ఇదే సమయానికి నాలుగు లక్షల టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు మనోధైర్యాన్ని కల్పించేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నట్లు తెలిపారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.పంట నష్టం వివరాలను ఇప్పటికే అధికారులు అందజేశారని, త్వరలోనే డబ్బులు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, పవర్ లూమ్, టెక్స్టైల్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మెన్ చిక్కాల రామారావు, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్.ఖీమ్యా నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, ఆర్డిఓ టి శ్రీనివాసరావు, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube