బిడ్డను సంరక్షకులకు పరిచయం చేసిన ఏనుగు.. హార్ట్ టచింగ్ స్టోరీ వైరల్..

ఏనుగులు( Elephants ) చాలా తెలివైనవి.తమను రక్షించిన వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాయి.

 The Elephant Who Introduced The Child To The Guardians Heart Touching Story Went-TeluguStop.com

ఏదో ఒక విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాయి.యజమానులను ఇవి విడిచిపెట్టడానికి నిరాకరిస్తాయి.

తాజాగా ఒక ఏనుగు తనను రక్షించిన వారికి తన బిడ్డను పరిచయం చేసింది.తన లైఫ్ ఇప్పుడు బాగానే ఉందని, తనకు ఒక బిడ్డ కూడా పుట్టిందని అది రెస్క్యూయర్స్‌కి తెలియపరిచింది.

ఇది తన పిల్లను వారి వద్దకు తీసుకువచ్చిన ఒక వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళితే, రక్షించబడిన ఏనుగు పేరు ఒలారే.

ఇది రీసెంట్‌గా తన ఏనుగు పిల్లను చూపించడానికి తాను పెరిగిన అభయారణ్యంకి తిరిగి వచ్చింది.కెన్యాలోని అనాథ ఏనుగులకు సహాయం చేసే NGO షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌లోని సిబ్బంది, ఓలా అని పేరు పెట్టబడిన ఒలారే బిడ్డను కలుసుకున్నందుకు చాలా సంతోషించారు.ఒలారే కథ విషాదం, విజయంతో కూడుకున్నది.2009లో అది కొన్ని నెలల వయస్సులో ఉన్నప్పుడు NGO దానిని రక్షించింది.దాని తల్లిని కాల్చి చంపేశారు.ఈ ఘటన ఒలారేను భయభ్రాంతులకు గురిచేసింది.ఎన్‌జీవో వారు ఒలారేను నర్సరీకి తీసుకువెళ్లారు, అక్కడ వారు దానికి ఫుడ్ పెట్టి ప్రేమ పంచారు.పెద్దయ్యే వరకు కంటికి రెప్పలా చూసుకున్నారు.

ఒలారే ఒక సెన్సిటివ్ ఎలిఫెంట్‌గా పెరిగింది.నర్సరీలోని ఇతర అనాథ ఏనుగుల బాగోగులు కూడా చూసుకుంది.తరువాత అడవికి తిరిగి పంపించడానికి సిద్ధంగా ఉన్న ఇతుంబా రీఇంటిగ్రేషన్ యూనిట్‌లోని ఇతర అనాథ ఏనుగులను చూసుకోవడంలో సహాయపడింది.అడవిలో సొంత దూడలకు జన్మనిచ్చిన ఇతర మాజీ అనాథలతో కూడా ఒలారే స్నేహం చేసింది.

2023లో, ఒలారే తన సొంత పిల్లతో ఇతుంబాకు తిరిగి వచ్చి సిబ్బందిని ఆశ్చర్యపరిచింది.ఓలాను కీపర్లకు గర్వంగా పరిచయం చేసింది.ఓలా ఒలారే మొదటి బిడ్డ.తల్లిని కోల్పోయిన బాధను దిగమింగుకుని ఇప్పుడు అదే తల్లి అయిన ఒలారే స్టోరీ అందర్నీ భావోద్వేగానికి గురిచేస్తుంది.ఎన్‌జీవో( NGO ) ఒలారే, ఓలాల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది, దానితో పాటు ఒలారే చరిత్రను వివరించి, ఆమె సాధించిన విజయాన్ని క్యాప్షన్ రూపంలో తెలియజేసింది.ఈ వీడియోకు దాదాపు వేలలో లైక్‌లు వచ్చాయి.

ఈ స్టోరీ తెలుసుకుని చాలామంది ఎమోషనల్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube