టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తర్వాత రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’.ఈ సినిమాను మొదట 2020 జులై 30న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ అనుకున్నట్లుగా జరగలేదు.దాంతో సినిమాను 2021 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
ఖచ్చితంగా ఆ తేదీకి రావడం ఖాయం అనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ గత ఆరు నెలలుగా జరగడం లేదు.దాంతో సినిమా విడుదల విషయంలో మళ్లీ సస్పెన్స్ నెలకొంది.
గత ఆరు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో సినిమా ను ఖచ్చితంగా అనుకున్న తేదీకి విడుదల చేయలేక పోవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో రాజమౌళి విడుదలపై మరింత క్లారిటీ ఇచ్చాడు.
సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది చెప్పలేని పరిస్థితి.ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదల గురించి తాను ఏమీ చెప్పలేను అన్నాడు.
అయితే షూటింగ్ ఒక వేళ ప్రారంభం అయ్యి సాఫీగా సాగితే ఆరు నుండి ఏడు నెలల తర్వాత సినిమాను విడుదల చేస్తామంటూ ఆయన ప్రకటించాడు.

తాజాగా టీవీ9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలియజేశాడు.భారీ అంచనాలున్న ఈ సినిమా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విషయంలో కూడా జక్కన్న స్పందించాడు.షూటింగ్ ప్రారంభం అయిన రెండు మూడు వారాల తర్వాత ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాతో పాటు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి మాట్లాడుతూ ఆ సినిమా ప్రారంభంకు మరో ఏడు ఎనిమిది ఏళ్లు పట్టే అవకాశం ఉందన్నాడు.దాన్ని 10 ఏళ్ల పాటు ఆరు ఏడు పార్ట్‌లుగా తీస్తానంటూ జక్కన్న పేర్కొన్నాడు.