తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ తీసుకున్న తర్వాత కొత్త ఊపు వచ్చింది.పార్టీ పరిస్థితి కూడా మెల్లిగా రేవంత్ సరి దిద్దుతు వచ్చారు.
అయితే రేవంత్ చేస్తున్న కార్యక్రమాలు పార్టీ కి కాకుండా, అయన స్వంత ఇమేజ్ ను పెంచుతూ వచ్చాయీ.దాంతో సీనియర్లు మొత్తం రేవంత్ రెడ్డీ పై గుర్రుగా ఉన్నారు.
అదికాస్తా.చిలికి చిలికి గాలి వాన అయినట్టు.
తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్థాయికి చేరుకుంది.భట్టి విక్రమార్క లాంటి నేత, ఉత్తం కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డీ లాంటి నేతలు రేవంత్ ను వ్యతిరేకించారు.

పార్టీ పరంగా వేసిన కమిటీల్లో.రేవంత్ వర్గానికి పెద్ద పీఠ వేశారని సీనియర్లు అలక పాన్పు ఎక్కరు.దాంతో సీనియర్ల దెబ్బకు.కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మాణిక్యం టాకుర్ ను ట్రాన్స్ఫర్ చేసారు.రేవంత్ కి బాగా సపోర్ట్ చేసే నేత వెళ్లిపోవడం తో.అయన పాదయాత్ర నినాదం ఎత్తుకున్నారు.రేవంత్ కు పగ్గాలు వచ్చిన దగ్గరి నించి ఇమేజ్ తెచ్చుకున్న మాట మాత్రం వాస్తవం.

ఆ ఇమేజ్ ను వాడుకొని.పార్టీ ను గాడిలో పెట్టాలని రేవంత్ భావిస్తూ ఉన్నారు.సీఎం కెసిఆర్ ను సభల్లో, కేంద్ర ప్రభుత్వాన్ని లోక్ సభలో రేవంత్ ఉతికి ఆరేస్తూ ఉన్నారు.
అయన విధానం ప్రజలకు బాగా క్లిక్ కావడం.ఇప్పుడు చేయబోయే యాత్రకు కలసి వచ్చే ఛాన్స్ ఉంది.
అది గాక.బీజేపీ నేతలు చేస్తున్న.మత విభజన ను కూడా రేవంత్ ఎండ గడుతు వస్తున్నాడు.తెలంగాణ లో ముస్లిం ఓటు బ్యాంకు అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ కి గణనీయంగా ఉంది.
వీటితో పాటు రేవంత్ రెడ్డీ అయితే తార తమ్యాలు లేకుండా.పార్టీ నీ నడపగలడు అనే నమ్మకం అటు అధిష్టానం తో పాటు.ఇటు కేడర్ లోనూ ఉండటం రేవంత్ కు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.రేవంత్ పాద యాత్ర పార్టీకి ఎంత వరకు కలసి వస్తుందో కానీ.
రేవంత్ రెడ్డి కి మాత్రం బాగా కలిసి వస్తుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.







