ఈ పూలతో శని దేవుడిని పూజిస్తే.. ధన వర్షం కురువడం ఖాయం..!

హిందూ ధర్మంలో శని దేవుడి( Lord Shani )ని న్యాయ దేవతగా భావిస్తారు.శని క్రమశిక్షణకు, సహనానికి మారుపేరు అని చాలామంది ప్రజలు నమ్ముతారు.

 If You Worship Lord Shani With These Flowers.. It Will Rain Money For Sure , Co-TeluguStop.com

శని దేవుడి దయ ఉంటే ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.ఆయన ఆగ్రహిస్తే మాత్రం పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది.

నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా శని ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు.అలాంటి శని దేవుడి దయ ఉండాలంటే ఆయనను ప్రసన్నం చేసుకోవాలి.

అంటే ఆయనను నిష్టగా, అలాగే ఆయనకు నచ్చినట్లుగా పూజించాలి.శని దేవుడి ఆశీర్వాదం పొందడానికి శనివారం రోజు నియమ నిష్ఠలతో పూజలు చేయాలి.

శనివారం రోజు నల్లని వస్త్రాలు ధరిస్తే కూడా శని దేవుడు అనుగ్రహిస్తాడు.

Telugu Bhakti, Devotional, Lord Shani, Shani Dev Pooja, Worship-Latest News - Te

ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో శని గ్రహా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే శని ప్రభావం తగ్గి శని దేవుడి ప్రసన్నం కావాలంటే ఆయనకు పూజలు చేసే సమయంలో మాత్రం నియమ నిష్ఠతో చేయాలి.శని పూజకు నీలం రంగు పూలను ఉపయోగించాలి.

నీలం రంగు శంఖం పూలు శని దేవుడికి ఎంతో ఇష్టం.శని దేవుడికి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత పూజలు చేయడం ఉత్తమమైన సమయం అని పండితులు చెబుతున్నారు.

నీలిరంగు అపరాజిత పుష్పాలు( Aparajita Plant Flower ) శని దేవుడికి ఇష్టమైన పూలు కావడంతో ఆ పూలతో శని దేవుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Telugu Bhakti, Devotional, Lord Shani, Shani Dev Pooja, Worship-Latest News - Te

అపరాజిత పూలను సమర్పిస్తే శని దేవుడు సంతోషిస్తాడు.శనివారం రోజు శని దేవుడి ముందు ఆవనూనె దీపాలు వెలిగించడం మంచిది.శని దేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం వల్ల శని అనుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుంది.

శని దేవుని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా శని విగ్రహాన్ని తాకకూడదు.ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలో అన్నీ ఆనందాలు దక్కుతాయి.శని తలుచుకుంటే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది.శని మన జీవితాన్ని క్రమబద్ధంగా ఉండేలా చేసే దేవుడు.

ఆయన క్రమశిక్షణకు మారుపేరు కాబట్టి ఆయన అనుగ్రహం కోసం నీలిరంగు అపరిచిత పుష్పాలతో శని దేవున్ని పూజించడం ఎంతో మంచిదనీ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube