మాఘమాసము చాలా విశిష్టమైన మాసము.ఉత్తరాయానంలో మాఘమాసం, దక్షిణ యానంలో కార్తీకమాసం రెండు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నవే.
మాఘమాసం సూర్యరాదనకు, విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రత్యేకమైనది.అలాంటి మాఘమాసంలో రథసప్తమి రావడమే ఈ మాసము ప్రాధాన్యతను తెలియజేస్తుందని ప్రముఖ వేద పండితులు చెబుతున్నారు.
మాఘ మాసంలో ఆదివారాలు సూర్యారాధన చేయడం ఎంతో పుణ్యం.
అంతేకాకుండా జ్యోతిషా శాస్త్రం ప్రకారం సప్తమి తిధి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు.
మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు సూర్య జయంతిగా మన పురాణాలలో ఉంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు రథసప్తమి రోజు తన తిది నీ ఉత్తర దిశగా మార్చుకున్న రోజు.
ఇలా సూర్యుని గతిలో మార్పులు రావడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమైపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని చెబుతుంటారు.రథ సప్తమి రోజు ఏ వ్యక్తి అయినా సరే సూర్యరాధన చేస్తే వారికి ఉన్న నవగ్రహ దోషాలు దూరం అయిపోయి ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

రథసప్తమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి పుణ్య నది స్నానం చేసి సూర్యభగవంతునికి తర్పణాలు వదలాలి.అంతే కాకుండా రథసప్తమి రోజు స్నానం ఆచరించేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకుని స్నానము చేయాలి.ఇలా స్నానం చేయడం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని సనాతన ధర్మంలో ఉంది.రథ సప్తమి రోజు బెల్లముతో పరమాన్నమును చేసి దాన్ని జిల్లేడు ఆకులో పెట్టి ఆ పరమనాన్ని సూర్య భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి.
సూర్య భగవంతుని అష్టోత్తర శతనామావళితో సూర్యారాధన చేయడం ఎంతో మంచిది.ఇలా సూర్యరాదన చేసి సూర్యునికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించిన వారికి అనారోగ్య సమస్యలు దూరమైపోతాయని వేద పండితులు చెబుతూ ఉంటారు.