ఇండస్ట్రీ ని షేక్ చేసే కాంబినేషన్స్ సెట్స్ దాకా వచ్చి ఆగిపోయినవి ఎన్నో ఉన్నాయి.అవి ఎదో ఒక సందర్భం లో మనకి తెలిసి, అయ్యో ఎలాంటి కాంబినేషన్ ని మా హీరో మిస్ అయ్యాడు అని అనుకుంటూ బాధపడుతాము.
అలాంటి సంఘటనలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )విషయం లో చాలానే జరిగింది.ఈయన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్ చూస్తే అభిమానులకు కడుపు మండిపోతాది.
పోకిరి, ( Pokiri )అతడు, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, గోలీమార్, మిరపకాయ్, గజినీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యువ ఇలా ఒక్కటా రెండా, ఎన్నో సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ ని మిస్ అయ్యాడు.అలా ఆయన బాలీవుడ్ ఎంట్రీ కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో అడుగుపెట్టాలని చూసి, అది మధ్యలోనే ఆగిపోయింది.
ఈ విషయం తెలుసుకొని అభిమానులు చాలా బాధపడుతున్నారు.
అసలు విషయం లోకి వెళ్తే అప్పట్లో ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా చేద్దాం అనుకున్నాడట.ఆ చిత్రం మరేదో కాదు, తెలుగు లో సెన్సేషన్ సృష్టించిన ‘ఖడ్గం’ చిత్రం( Khadgam ).ఈ సినిమాని హిందీ లో రీమేక్ చేద్దాం అనుకున్నాడట.శ్రీకాంత్ క్యారక్టర్ లో షారుఖ్ ఖాన్,( Shah Rukh Khan ) రవితేజ క్యారక్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రకాష్ రాజ్ క్యారక్టర్ లో అమితాబ్ బచ్చన్.కృష్ణ వంశీ అడిగితే షారుఖ్ ఖాన్ నో అనే సమస్యే లేదు.
ఎందుకంటే 2002 వ సంవత్సరం లో షారుఖ్ ఖాన్ తో ఆయన ‘శక్తి : ది పవర్’ అనే చిత్రం( Shakti: The Power ) చేసాడు.ఈ సినిమాలో తెలుగు లో కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘అంతపురం’ కి రీమేక్.
ఇందులో జగపతి బాబు క్యారక్టర్ ని బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ చేసాడు.
ఆ పాత్ర షారుఖ్ ఖాన్ కి మంచి పేరు తెచ్చింది, ఆ కృతజ్ఞతతో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) కూడా అడగగానే ఒప్పుకున్నాడు.అయితే ఇంతలోపే తెలుగు లో ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది.కానీ వివాదాలు మాత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో జరిగాయి.
థియేటర్స్ లో హిందూ మరియు ముస్లిమ్స్ మధ్య మత కలహాలు జరిగాయి.ఇది అప్పట్లో నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.
దీంతో షారుఖ్ ఖాన్ ఈ చిత్రానికి మీ ప్రాంతం లోనే అలాంటి రెస్పాన్స్ వచ్చింది అంటే, ఇక్కడ అంతకు పదింతలు వివాదాలు జరుగుతాయి.ఈ ప్రాజెక్ట్ ని ఆపేయడం బెటర్ అనడం తో కృష్ణ వంశీ( Krishna Vamsi ) కూడా సైలెంట్ అయ్యాడు.
పవన్ కళ్యాణ్ కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోవడం తో ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది.