ఈ పూలతో శని దేవుడిని పూజిస్తే.. ధన వర్షం కురువడం ఖాయం..!
TeluguStop.com
హిందూ ధర్మంలో శని దేవుడి( Lord Shani )ని న్యాయ దేవతగా భావిస్తారు.
శని క్రమశిక్షణకు, సహనానికి మారుపేరు అని చాలామంది ప్రజలు నమ్ముతారు.శని దేవుడి దయ ఉంటే ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఆయన ఆగ్రహిస్తే మాత్రం పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది.నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా శని ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు.
అలాంటి శని దేవుడి దయ ఉండాలంటే ఆయనను ప్రసన్నం చేసుకోవాలి.అంటే ఆయనను నిష్టగా, అలాగే ఆయనకు నచ్చినట్లుగా పూజించాలి.
శని దేవుడి ఆశీర్వాదం పొందడానికి శనివారం రోజు నియమ నిష్ఠలతో పూజలు చేయాలి.
శనివారం రోజు నల్లని వస్త్రాలు ధరిస్తే కూడా శని దేవుడు అనుగ్రహిస్తాడు.
"""/" /
ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో శని గ్రహా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే శని ప్రభావం తగ్గి శని దేవుడి ప్రసన్నం కావాలంటే ఆయనకు పూజలు చేసే సమయంలో మాత్రం నియమ నిష్ఠతో చేయాలి.
శని పూజకు నీలం రంగు పూలను ఉపయోగించాలి.నీలం రంగు శంఖం పూలు శని దేవుడికి ఎంతో ఇష్టం.
శని దేవుడికి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత పూజలు చేయడం ఉత్తమమైన సమయం అని పండితులు చెబుతున్నారు.
నీలిరంగు అపరాజిత పుష్పాలు( Aparajita Plant Flower ) శని దేవుడికి ఇష్టమైన పూలు కావడంతో ఆ పూలతో శని దేవుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
"""/" /
అపరాజిత పూలను సమర్పిస్తే శని దేవుడు సంతోషిస్తాడు.శనివారం రోజు శని దేవుడి ముందు ఆవనూనె దీపాలు వెలిగించడం మంచిది.
శని దేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం వల్ల శని అనుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుంది.
శని దేవుని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా శని విగ్రహాన్ని తాకకూడదు.ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలో అన్నీ ఆనందాలు దక్కుతాయి.
శని తలుచుకుంటే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది.శని మన జీవితాన్ని క్రమబద్ధంగా ఉండేలా చేసే దేవుడు.
ఆయన క్రమశిక్షణకు మారుపేరు కాబట్టి ఆయన అనుగ్రహం కోసం నీలిరంగు అపరిచిత పుష్పాలతో శని దేవున్ని పూజించడం ఎంతో మంచిదనీ చెబుతున్నారు.
తేజ సజ్జ బాటలోనే నడుస్తున్న విశ్వక్ సేన్…