వర లక్ష్మీదేవి అంటే వరాలు ఇచ్చే దేవి అని దాదాపు చాలామందికి తెలుసు.వరలక్ష్మీదేవిని( Goddess Varalakshmi ) పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
శ్రావణమాసంలో ఆచరించే వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది.అంతేకాకుండా మహిళలు సుమంగళిగా ఉండేందుకు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు.
వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి? అమ్మవారికి నైవేద్యంగా ఏమి పెట్టాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తారు.
వేకువ జామునే నిద్రలేచి, ఇల్లు శుభ్రం చేసుకుని, అమ్మవారిని అలంకరించి, పిండి వంటకాలతో నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు.అయితే ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వులతో పూజ చేసి, ఇష్టమైన ద్రవాలు, పిండి వంటకాలతో నైవేద్యం పెడతారు.వరలక్ష్మి అమ్మవారికి గోక్షీరం అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి( Cow ghee ) ఎంతో ఇష్టం.అలాగే అమ్మవారికి పాయసం అంటే కూడా ఎంతో ఇష్టం.
ముఖ్యంగా చెప్పాలంటే పాలలో ఉడికిన అన్నంతో పాయసం చేసి నైవేద్యాన్ని పెట్టాలి.అలాగే దద్దోజనం, పులిహార ఇలా వీలైనంత పిండి వంటకాలు నై వైద్యంగా పెట్టవచ్చు.
ఇంకా చెప్పాలంటే అమ్మవారికి నారికేళం అంటే కొబ్బరికాయ( Coconut ) కూడా ఎంతో ఇష్టం.అమ్మవారికి ఇష్టమైన పత్రం మారడు పత్రం.ఇష్టమైన జంతువు ఏనుగు.అందుకే అమ్మవారికి పూజకు చేసే సమయంలో ఏనుగు బొమ్మలను రెండు వైపులా ఉంచుతారు.వీటన్నిటితో పాటు అమ్మవారికి ఇష్టమైన స్వరూపంగా తయారైన మహిళలు వ్రతం ఆచరించాలి.తలలో పువ్వులు పెట్టుకొని, కాళ్లకు పసుపు, కళ్లకు కాటుక, చేతికి గాజులు, మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టెలు, నుదుటన కుంకుమ కచ్చితంగా ధరించాలి.
భర్త చేయించిన బంగారు వస్తువులను మొదట అమ్మవారికి పూజలో అలంకరించి ఆ తర్వాత మహిళలు ధరించాలి.