కొడాలి నాని మేనకోడలు వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్..!!

మాజీమంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని( Ex Minister Kodali Nani ) మేనకోడలు కోనేరు లీల ప్రసాద్, రాజ్యలక్ష్మి విజయ చాముండేశ్వరి దేవి కుమార్తె డా.స్నేహ వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు.

 Cm Jagan Attended The Wedding Ceremony Of Kodali Nani Niece, Kodali Nani, Cm Ys-TeluguStop.com

విజయవాడ కంకిపాడు లో అయాన కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలో వధూవరులు స్నేహ మరియు అనురాగ్ దీపక్ లను సీఎం జగన్ ఆశీర్వదించారు.ఈ వివాహ కార్యక్రమానికి వైసీపీ నేతలు కూడా హాజరు కావడం జరిగింది.

ఇదిలా ఉంటే రేపు శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్( CM YS Jagan ) పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

పట్టు వస్త్రాలతో( Silk Clothes ) పాటు పసుపు, కుంకుమలను కూడా ప్రభుత్వం తరఫున అందించబోతున్నారు.

ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.

అమ్మవారి దర్శనానికి ప్రముఖులు వస్తూ ఉండటంతో ఆలయ పరిసర ప్రాంతాలలో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ సైతం ఆకస్మిక తనిఖీలు చేస్తూ భద్రత ఏర్పాట్లు సమీక్షిస్తూ ఉన్నారు.

ఈ క్రమంలో రేపు ముఖ్యమంత్రి ఇంద్రకీలాద్రి వస్తూ ఉండటంతో అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube