ఇటీవల రోజుల్లో క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం, జన్యుపరమైన లోపాలు, పలు రకాల మందుల వాడకం వంటి ఎన్నో కారణాల వల్ల క్యాన్సర్‌కి గురవుతున్నారు.
ఇక ఆ తర్వాత దాని నివారణ కోసం ముప్ప తిప్పలు పడాల్సి ఉంటుంది.అందుకే వచ్చాక బాధ పడటం కంటే రాకుండా జాగ్రత్త పడటమే మేలు.
అయితే క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాల్మన్ చేపలు.రుచిగా ఉండటమే కాదు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటాయి.సాల్మన్ చేపలను వారంలో కనీసం ఒక సారి తీసుకుంటే గనుక.వాటిల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లివర్ క్యాన్సర్ రాకుండా అడ్డు కట్ట వేస్తాయి.
పసుపు.దీనిని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.తద్వారా పసుపులో ఉండే ప్రత్యేక సుగుణాలు రొమ్ము క్యాన్సర్, చర్మ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పేగు క్యాన్సర్ వంటి వాటిని నిరోధిస్తాయి.
అలాగే రోజుకొక దానిమ్మ పండును ఖచ్చితంగా తీసుకుంటే శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండటమే కాదు.
అనేక అనారోగ్య సమస్యలు సైతం దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

ద్రాక్ష పండ్లతో కూడా క్యాన్సర్ వ్యాధికి దూరంగా ఉండొచ్చు.ద్రాక్ష పండ్లను తరచూ తీసుకుంటే.వీటిల్లో ఉండే ఎలాజిక్ యాసిడ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా రక్షణ కల్పిస్తుంది.
ఇక ఇవే కాకుండా మిరియాలు, క్యారెట్, వెల్లుల్లి, బీన్స్, అవిసె గింజలు, నారింజ పండ్లు, బ్రోకలీ, యాపిల్, గ్రీన్ టీ, బీన్స్, స్ప్రౌట్స్, బ్రెజిల్ నట్స్ వంటి వాటిని తీసుకోవడం ద్వారా కూడా క్యాన్సర్ వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు.