ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు.అలాగే తిరుమల దేవస్థానానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి తల నీలాలను సమర్పిస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సేవలను రద్దు చేసింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన శ్రీ గోవింద రాజుల స్వామి వారి దేవాలయంలో భోగితేరు, అలాగే జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు.

అలాగే జనవరి 14వ తేదీన సాయంత్రం 5:30 నిమిషముల నుంచి రాత్రి 7:00 గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు( Sri Andal Ammavaru ) శ్రీకృష్ణ స్వామి వారిని భోగి తేరు పై కొలువు తీర్చి ఊరేగిస్తారని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే 16వ తేదీన పార్వేట ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.అదే రోజు గోదా పరిణయోత్సవం కూడా జరుగుతుందని స్థానిక పండితులు చెబుతున్నారు.
అంతే కాకుండా ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెదజీయర్ మఠం నుంచి దేవాలయం నాలుగు మడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారికి సమర్పిస్తారు.అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీ మలయాప్ప స్వామి వారు శ్రీకృష్ణ స్వామి వారు పార్వేట మండపానికి వేంచేస్తారు.

ఆస్థానం పారువేట కార్యక్రమాల తరువాత స్వామి వారు దేవాలయానికి చేరుకుంటారు.ఈ నేపథ్యంలో 16వ తేదీన శ్రీవారి దేవాలయంలో నిర్వహించాల్సిన అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసినట్లు ఆలయం ముఖ్య అధికారులు వెల్లడించారు.అంతేకాకుండా నిన్న ప్రారంభమైన శ్రీ ఆండాళ్ ఉత్సవాలు ఈ నెల జనవరి 13వ తేదీ వరకు కొనసాగుతాయని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.