నర దిష్టి నరఘోష పోవాలంటే బుద్ధ పూర్ణిమ రోజు కరక్కాయతో ఇలా చేయండి..!

వైశాఖ పౌర్ణమి మే 5వ తేదీన ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది.బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు బుద్ధ జయంతిని( Buddha Jayanthi ) ప్రజలు జరుపుకుంటారు.

 Get Rid Of Nara Drishti With These Methods On Buddha Purnima Details, , Nara Dri-TeluguStop.com

ఇదే రోజున బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అని కూడా నమ్ముతారు.ఈ ఏడాది గౌతమ బుద్ధుడి 2585వ జయంతిగా జరుపుకుంటూ ఉన్నారు.

మే 5వ తేదీన ఉదయం సమయంలో శుభ్రంగా స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముఖద్వారం ముందు పసుపుతో లేదా కుంకుమతో స్వస్తిక్ వేయాలి.

అంతేకాకుండా పేదలకు దానంగా ఆహారం, దుస్తులు ఇవ్వడం కూడా ఎంతో మంచిదే.

వైశాఖ పౌర్ణమి( Vishaka Pournami ) రోజున సముద్ర స్థానం తప్పనిసరిగా ఆచరించాలి.ఈ రోజున కరక్కాయను తీసుకెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం ద్వారా నర దిష్టి, నరఘోష తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

జ్ఞాన పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ, శ్రీ కూర్మ జయంతి, అన్నమయ్య జయంతి అన్ని విశేషాలు ఈ రోజున జరుపుకుంటారు.

వైశాఖ పౌర్ణమి రోజు కుర్మావతారం ఎత్తిన శ్రీమహావిష్ణువు( Srimaha Vishnu ) ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణంలో ఉంది.అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించారు.ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతాయి.

సంపదలు కలగగానే కోరికలతో ఈ రోజున గౌరీవ్రతాన్ని ఆచరించాలి.

గౌరీదేవిని పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి.ఈ రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, పేదవారికి వస్త్రదనం, గొడుగు, చెప్పులు, నీటి కుండా వంటివి దానం చేయడంవల్ల పుణ్యఫలం లభిస్తుంది.వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో తులసి కోటను శుభ్రం చేసుకుని పూజించడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube