163 కంపెనీలు.. 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 4.25 లక్షల ఉద్యోగాలు : ఇది అమెరికాలో భారతీయ సంస్థల సత్తా

163 భారతీయ కంపెనీలు ఇప్పటి వరకు అమెరికాలో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.దీని వల్ల అగ్రరాజ్యంలో 4,25,000కు పైగా ఉద్యోగాలు వచ్చాయని ఒక సర్వే తెలిపింది.

 163 Indian Companies Invested Usd 40 Bn In Us Cii Report , Cii Report, Us, 163-TeluguStop.com

‘Indian Roots, American Soil’ పేరుతో కాన్‌ఫెడ్రేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) రూపొందించిన సర్వేను బుధవారం అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు( Taranjit Singh Sandhu ), భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన ఎరిక్ గార్సెట్టి సమక్షంలో వెల్లడించారు.భారతీయ కంపెనీలు అమెరికాలో కార్పోరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద దాదాపు 185 మిలియన్ డాలర్లను వెచ్చించాయని సర్వే తెలిపింది.

వీటిలో అమెరికా కేంద్రంగా చేపట్టిన రీసెర్చింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ప్రాజెక్ట్‌లకు ఫైనాన్సింగ్ నిమిత్తం ఇచ్చిన దాదాపు 1 బిలియన్ డాలర్లు కూడా వున్నాయి.

Telugu Indian, American Soil, Ciigeneral, Cii, Indian Roots, Taranjitsingh-Telug

ఈ సందర్భంగా తరంజిత్ సింగ్ సంధూ మాట్లాడుతూ.అమెరికాలోని( America ) భారతీయ కంపెనీలు అగ్రరాజ్యానికి బలాన్ని, పోటీతత్వాన్ని తీసుకొస్తాయన్నారు.ఉద్యోగాలను సృష్టించడంతో పాటు స్థానిక కమ్యూనిటీకి భారతీయ కంపెనీలు మద్ధతుగా నిలిచాయని సంధూ ప్రశంసించారు.

తన ప్రయాణంలో అమెరికా వ్యాప్తంగా భారతీయ కంపెనీలు చేసిన కృషిని చూసి తాను ఆశ్చర్యపోయానని ఆయన పేర్కొన్నారు.విజయాన్ని పంచుకోవాలన్న సూత్రాన్ని భారత్ ఎప్పుడూ నమ్ముతుందని.పంచుకోవడమే అసలైన విజయమని సంధూ తెలిపారు.సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ( CII Director General Chandrajit Banerjee ) ప్రకారం.

భారతీయ కంపెనీలు అమెరికా మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఉద్యోగ కల్పన, విస్తరణ చేపట్టాయన్నారు.రాబోయే కాలంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడంతో పాటు భారత్ – అమెరికా సంబంధాలను వృద్థిపథంలో వుంచుతాయని చంద్రజిత్ ఆకాంక్షించారు.

Telugu Indian, American Soil, Ciigeneral, Cii, Indian Roots, Taranjitsingh-Telug

ఇకపోతే.భారతీయ కంపెనీలు( Indian companies ) సృష్టించిన ఉద్యోగాల ద్వారా లబ్ది పొందుతున్న అమెరికాలోని మొదటి పది రాష్ట్రాల విషయానికి వస్తే.టెక్సాస్ (20,906 ఉద్యోగాలు), న్యూయార్క్ (19,162 ఉద్యోగాలు), న్యూజెర్సీ (17,713 ఉద్యోగాలు), వాషింగ్టన్ (14,525 ఉద్యోగాలు), ఫ్లోరిడా (14,418 ఉద్యోగాలు), కాలిఫోర్నియా (14,334 ఉద్యోగాలు), జార్జియా (13,945 ఉద్యోగాలు), ఒహియో (12,188 ఉద్యోగాలు), మోంటానా (9,603 ఉద్యోగాలు), ఇల్లినాయిస్ (8,454 ఉద్యోగాలు) వున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube