ఈ మధ్య కాలంలో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలు అనే తేడాల్లేకుండా వరుస వివాదాలు ఇండస్ట్రీ పరువు తీస్తున్నాయి.బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ( Hema ) దొరకడం ఆ తర్వాత నేను బెంగళూరులో లేనంటూ హేమ వీడియోలు చేయడం సంచలనం అయిన సంగతి తెలిసిందే.
వరుస వివాదాల వల్ల హేమ గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వచ్చాయి.హేమ ముందే నిజం చెప్పి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపించాయి.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్( Raj Tarun ) ఒక అమ్మాయిని మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.గతంలో ఒక కేసులో పట్టుబడిన లావణ్య రాజ్ తరుణ్ స్థాయిని తగ్గించేలా కామెంట్లు చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
రాజ్ తరుణ్ సినిమా తిరగబడరా సామీ ఈ వివాదం వల్ల వాయిదా పడిందని సమాచారం అందుతోంది.రాజ్ తరుణ్ ఆఫర్లపై ఈ వివాదాలు ప్రభావం చూపుతున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో దర్శన్ ( Darshan ) రేణుకాస్వామిని హత్య చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి.దర్శన్ కెరీర్ ఈ కేసు వల్ల ప్రమాదంలో పడినట్టేనని కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం.సుచీలీక్స్ పేరుతో సంచలనం సృష్టించిన కోలీవుడ్ సింగర్ సుచిత్ర( Singer Suchitra ) త్రిష, ధనుష్ వల్లే గతంలో వీడియోలు బయటకు వచ్చాయని చెప్పుకొచ్చారు.
ప్రముఖ కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్( Mansoor Ali Khan ) టాలీవుడ్ సెలబ్రిటీల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.మాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీప్లెక్స్ వివాదం నెలకొనగా ఆడు జీవితం( Aadu Jeevitham ) సినిమా ప్రదర్శనకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి.ఈ విధంగా ఊహించని వివాదాలు సౌత్ ఇండస్ట్రీ పరువు తీస్తున్నాయి.రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుందని చెప్పవచ్చు.