ఆ వీడియోపై యాంకర్ రష్మీ అసహనం... సీఎంకు ట్యాగ్ చేసి నెట్టింట్లో రచ్చ రచ్చ!

బుల్లితెర యాంకర్ గా,వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.

 Anchor Rashmi Gautam Fires On Zoo Employee, Rashmi Gautham , Zoo Employee, Socia-TeluguStop.com

ఈ క్రమంలోనే తిరిగి సినిమాలలో పలు క్యారెక్టర్ల ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక బుల్లితెరపై యాంకరమ్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ముఖ్యంగా సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీ కెమిస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే.వీరిద్దరూ కలిసి ఏదైనా స్కిట్ లేదా ఫర్ఫార్మెన్స్ చేశారంటే ఆ ఫర్ఫార్మెన్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుందని చెప్పవచ్చు.

ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రష్మి మూగజీవాల పట్ల కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వాటిపై ప్రేమను వ్యక్తపరుస్తుంది.ఈ క్రమంలోనే ఎవరైనా జంతువులకు హాని కలిగితే వారిపై తీవ్రంగా స్పందిస్తూ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు డిమాండ్ చేస్తుంది.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి రష్మి కంట పడటంతో ఆ వీడియో పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.ఢిల్లీలో ఒక జూలో ఉద్యోగి అనవసరంగా ఒక జంతువును తీవ్రంగా కొట్టారు.ఈ వీడియో చూసిన రష్మీ ఎమోషనల్ అవుతూ ఈ వీడియోపై స్పందించి సీఎంకు ట్యాగ్ చేశారు.ఈ వీడియో ఆమె స్పందిస్తూ మిమ్మల్ని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది ఇకపై ఎవరూ జూకి వెళ్ళకండి.

ఈ జంతువులను ఎంతగా హింసిస్తున్నారు ఒక్కసారి ఆలోచించమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మేనకా గాంధీ వంటి వారికి ఈమె విజ్ఞప్తి చేశారు.మనకు రెండు నెలలు లాక్ డౌన్ విధించినప్పుడు ఎంతో మెంటల్ వచ్చింది.

అలాంటిది జీవితాంతం ఈ జంతువులు జైల్లో ఉంటాయి.వాటిని ఫ్రీగా వదిలేయండి అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube