సాధారణంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు చెబితే వైసిపి కారాలు మిరియాలు నూరుతుంది.జగన్ 16 నెలల పాటు జైలు పాలు కావడానికి కారణం ఆయనే అని, ఆయన సిబిఐ అధికారి గా ఉన్న సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన దర్యాప్తు చేపట్టి జగన్ అక్రమాలకు పాల్పడ్డారని నిరూపించే ప్రయత్నం చేయడం వంటి వ్యవహారాలతో ఆయన పై వైసీపీ నాయకులందరికీ ఆగ్రహం ఉంటూనే వచ్చింది.
ఇక ఆ తర్వాతి పరిణామాల్లో లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరి ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసారు.ఇక ఏ పార్టీలోనూ ఆయన చేరే విషయంలో ఒక క్లారిటీ కి రాలేదు అయితే ఇప్పుడు లక్ష్మీనారాయణ చేసిన పనికి వైసిపి ఆయనపై ఒక్కసారిగా ప్రశంసలు కురిపిస్తూ ఉంది.
దీనికి కారణం నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో ఓ టీవీ ఛానల్ డిబేట్ పాల్గొన్న ఆయన మాట్లాడిన మాటలే కారణం.
లోక్ సభ స్పీకర్ అనుమతి లేకుండా రఘురామ ను అరెస్ట్ చేశారని, ఇది చాలా తీవ్రమైన నేరం అంటూ టిడిపి జనసేన పార్టీ లు హడావుడి చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు అయితే అంతే లేదు.ఎంపీలకు ప్రత్యేక ప్రివిలేజెస్ ఉంటాయని , కానీ అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం అరెస్టులకు వెళ్లి తొందర పడింది అంటూ విమర్శలు చేశాయి.
అయితే ఇదే అంశంపై ఓ టీవీ ఛానల్ లక్ష్మీనారాయణను వివరణ కోరగా ఆయన స్పందిస్తూ అరెస్టు చేసిన తరువాత సమాచారం అందించాలి .అంతే తప్ప అరెస్టు చేసేందుకు స్పీకర్ అనుమతి అవసరం లేదు అని, ఒకవేళ పార్లమెంట్ సెషన్ జరుగుతుంటే మాత్రం స్పీకర్ అనుమతి తీసుకుని అరెస్టు చేయాలి అంటూ చెప్పారు.

అయితే ఎందుకు అరెస్టు చేసామో స్పీకర్ కు చెప్పాల్సిన అవసరం లేదా అంటూ సదరు ఛానల్ ప్రతినిధి లక్ష్మీనారాయణ ను ప్రశ్నించగా , అవసరం లేదు అని, కోర్టుకు మాత్రమే ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలని, ఈ కేసులు కోర్టు తో లింక్ అయి ఉంటాయని ఎందుకంటే వాళ్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు కాబట్టి ప్రివిలేజెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవసరం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
దర్యాప్తు సంస్థలు కోర్టుకి బాధ్యత వహించాల్సి ఉంటుందని , మరెవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంటూ మాట్లాడారు.లక్ష్మీనారాయణ క్లారిటీతో ప్రతిపక్షాలు సైలెంట్ అయిపోయాయి.ఇప్పటి వరకు ఇవే అంశాలపై వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిపక్షాలు జెడి క్లారిటీతో ఈ అంశానికి పులిస్టాప్ పెట్టేశాయి.
.






