Rama Idols : కృష్ణా నదిలో ప్రత్యక్షమైన రాముడు విగ్రహాలు..! అసలు కారణం ఏమిటి..?

సాధారణంగా హిందువులకు పురాతన దేవతామూర్తులు విగ్రహాలు అంటే చాలా మక్కువ.అలాంటి విగ్రహాలు ఇటీవల తెలుగు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కృష్ణానదిలో( Krishna River ) ఎన్నోసార్లు బయటపడ్డాయి.

ఈ విగ్రహాలను వేటకు వెళ్ళిన మత్స్యకారులకు దొరకడం, వారు వాటిని బయట తీసుకురావడం జరుగుతుంది.

ఇప్పటికే పలుసార్లు నాగదేవత విగ్రహాలు, శివలింగం, విష్ణుమూర్తి, నంది( Nagadevata, Shivlingam, Vishnumurthy, Nandi ) ఇలా సుమారు 11 రకాల రాతి విగ్రహాలను గుర్తించడం జరిగింది.

వీటిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా కూడా తరలివచ్చేవారు.ఇలాంటి సంఘటనే తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కృష్ణా నదిలో కూడా జరిగింది.

"""/" / అక్కడ వంతెన పనులు జరుగుతున్న సమయంలో సాక్షాత్తు ఆ దేవత మూర్తి విగ్రహం బయటపడడం జరిగింది.

తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కృష్ణా నదికి సంబంధించి వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

అయితే ఆ సమయంలోనే మంగళవారం వంతెన పనులు చేస్తుండగా నదిలో కొన్ని విగ్రహాలు దర్శనమిచ్చాయి.

వాటిని అలా తవ్వుతుండగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ( Shri Mahavishnu )నిలువెత్తు విగ్రహం, ఒక శివలింగం దర్శనం ఇచ్చింది.

దీనిని అధికారుల ఆదేశాలతో అత్యంత జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టి, విగ్రహాలకు ఎలాంటి దెబ్బతినకుండా బయటకు తీయడం జరిగింది.

అయితే వాటిలో శ్రీమహావిష్ణువు విగ్రహం పరిశీలించగా అది ఇటీవలే అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన రామ్ లల్ల విగ్రహం( Ram Lalla Statue ) లాగే ఉంది.

"""/" / ఆ విగ్రహాలు శతాబ్దాల చరిత్ర చెందినవిగా కూడా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని చూస్తే నాలుగు చేతులతో నిలబడిన ఆకారంలో కనిపించింది పై చేతుల్లో శంకు చక్రాలు, మరో రెండు చేతుల్లో కటి హస్తా, వరద హస్త కూడా ఉన్నాయి.

ఇక విష్ణువు చుట్టూ మత్స్య, కుర్మా, వరాహ, నరసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి లాంటి దశావతారాలు కూడా కలిగి ఉన్నాయి.

ఆ విగ్రహానికి పూలమాలలు కూడా ఉండడం విశేషమని చెప్పవచ్చు.దీంతో ఈ వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వ్యాపించింది.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide