మీరు నాన్ వెజ్ కు దూరంగా ఉంటారా.. అయితే మీ డైట్ లో ఇవి ఉండాల్సిందే?

నాన్ వెజ్ కు దూరంగా ఉండేవారు చాలా మంది ఉన్నారు.అయితే వీరిలో ప్రోటీన్ కొరత‌ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

 How To Get Protein For Vegetarians Protein, Protein Rich Foods, Latest News, Hea-TeluguStop.com

ఈ ప్రోటీన్ కొరతను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు( Health problems ) తలెత్తుతుంటాయి.అలా అని ఇష్టం లేకపోయినా ప్రోటీన్ కోసం నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ ను తీసుకుంటే మీలో ప్రోటీన్ కొరత అనేది ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

వాల్ నట్స్( Wall nuts ).ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ వీటిలో ప్రోటీన్ పుష్కలంగా నిండి ఉంటుంది.అందువ‌ల్ల రోజుకు రెండు లేదా మూడు వాటర్ లో నానబెట్టిన వాల్ నట్స్ ను తీసుకోండి.అలాగే నట్స్ లో జీడిపప్పు, బాదం( Cashews, almonds ) లో కూడా ప్రోటీన్ ఉంటుంది.

రెగ్యులర్ డైట్ లో ఇవి కూడా ఉండేలా చూసుకోండి.ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లో గుమ్మడి గింజలు ఒకటి.

రోజుకు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు తినండి.ఇవి మీ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ తో పాటు ఎన్నో పోషకాలను అందిస్తాయి.

Telugu Tips, Latest, Protein, Vegetarians-Telugu Health

చియా సీడ్స్( Chia seeds ).ఇవి కేవలం వెయిట్ లాస్ కు మాత్ర‌మే సహాయపడతాయి అనుకుంటే పొరపాటే అవుతుంది.ఎందుకంటే, చియా సీడ్స్ ప్రోటీన్ కొరతను నివారించడానికి కూడా ఉత్తమంగా హెల్ప్ చేస్తాయి.అందుకే రోజుకి వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ను వాటర్ లో నానబెట్టి తీసుకుంటే ప్రోటీన్ కొరత అన్నదే ఉండదు.

పొద్దుతిరుగుడు విత్తనాల్లో కూడా ప్రోటీన్ మెండుగా ఉంటుంది.అందువల్ల నాన్ వెజ్ కు దూరంగా ఉండేవారు వీటిని ఆహారంలో భాగం చేసుకోండి.

Telugu Tips, Latest, Protein, Vegetarians-Telugu Health

బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, శనగలు, అలసందలు, ఎర్ర కందిపప్పు వంటి ఆహారాల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.అంతే కాదండోయ్ బ్రౌన్ రైస్, స్టీల్ కట్ ఓట్స్, కొర్రలు, జొన్నలు, హోల్ వీట్ బ్రెడ్, మిల్లెట్స్, ఆల్మండ్ బటర్, పీనట్ బటర్ వంటి ఫుడ్స్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది.కాబట్టి ప్రోటీన్ కోసం ఇష్టం లేకున్నా నాన్ వెజ్ ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు.ఇప్పుడు చెప్పుకున్న ఆహారాలు మీ డైట్ లో ఉంటే కనుక అసలు మీలో ప్రోటీన్ కొరత అనేది ఉండదు.

పైగా ఇవన్నీ హెల్తీ ఫుడ్స్.కాబ‌ట్టి ఇవి మీ ఆరోగ్యానికి ఎల్లప్పుడూ రక్షణ కవచంలా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube