తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా( Urvashi Rautela ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
ఇక ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీగా అభిమానులు ఉన్నారు.అమ్మాయిలకి అసూయ తెప్పించే తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ కుర్రాళ్ళ కళ్ళ రాకుమారిగా వెలుగొందుతోంది.
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

వరుస ఐటం సాంగ్స్ చేస్తూ కోట్లు పోగేస్తోంది.ఆమె కెరీర్ విషయం పక్కన పెడితే వ్యక్తిగత విషయంలో మాత్రం ఆమె చాలా లగ్జరీగా గడుపుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.అలా వేసుకునే బట్టలు,చెప్పులు,వాచ్ లు, తిరిగే కార్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఖరీదైనవే.
అంత బాగానే ఉంది కానీ ఊర్వశి చివరికి నైట్ డ్రెస్ కోసం కూడా వేలకు వేలు ఖర్చు పెట్టడం ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఉంది.తాజాగా ఊర్వశి రౌతేలా ఓ తెలుగు సినిమా కోసం హైదరాబాద్‌కు వచ్చింది.
ఎయిర్ పోర్టులో ఆమె పింక్ కలర్ నైట్ సూట్‌లో( pink color night suit ) దర్శనమిచ్చింది.

నైట్ డ్రెస్సే కదా వందల్లో ఉంటుందనుకుంటే పొరపాటు పడ్డట్టే.ఆమె ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ.91,000 ఉంటుందని తెలుస్తోంది.అందుకు సంబంధించిన ఫోటోలు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.ఏంటి ఒక్క నైట్ డ్రెస్ అన్ని వేల రూపాయల అంటూ నోరెళ్ళబెడుతున్నారు.
ఇంకొందరు సెలబ్రిటీలు( Celebrities అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ నటిస్తున్న బ్రో సినిమాలో ఐటెం సాంగ్ కు రకుల్ ప్రీత్ సింగ్ హ్యాండ్ ఇవ్వడంతో ఊర్వశీను తీసుకోవాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
అందుకోసమే ఆమె హైదరాబాద్కు వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.








