వైసిపి పార్టీ లోకి వచ్చాక దాదాపు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే.అంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో పార్టీ తరఫున కీలకంగా రాణించిన గాని ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు లేవు.
ఇదిలా ఉంటే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక రోజా కి గ్యారెంటీగా మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు.కానీ అప్పట్లో సీఎం జగన్… రోజాకి ఎటువంటి పదవి కట్టబెట్ట లేదు.
ఏపీఐఐసీ చైర్మన్ పదవి మాత్రమే ఇవ్వడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన జగన్ రోజాకి మంత్రి పదవి కట్టబెట్టడం తెలిసిందే.
ఇటువంటి తరుణంలో మంత్రి పదవి లభించిన తరువాత రోజా సీఎం జగన్ పై ప్రత్యేకమైన అభిమానం చాటడం జరిగింది.పార్టీ ఎటువంటి శాఖ కేటాయించిన సమర్థవంతంగా పని చేస్తానని కూడా రోజా తెలిపారు.
ఇక ఇదే సమయంలో ఆమె మరో సంచలన ప్రకటన చేశారు.
సినిమాలకు అదేవిధంగా జబర్దస్త్ కామెడీ షోకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.
మంత్రిగా పూర్తి సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.మంత్రిగా ముఖ్యమంత్రికి మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు.
ప్రాణం ఉన్నంతవరకు జగనన్న కోసం పని చేస్తాను అని సంచలన డైలాగులు వేశారు.







