అరబ్బు దేశంలో ఘనంగా “తెలుగు బాషా దినోత్సవం”

తెలుగు బాషా దినోత్సవం గురించి తెలుగు రాష్ట్రాల ఉన్న ఎంతో మంది తెలుగు వాళ్ళు మర్చిపోతుంటే దేశం కాని దేశంలో ఉంటూ పాశ్చాత్య సంస్కృతికి అతి దగ్గరగా ఉన్న మన తెలుగు ప్రవాసులు ఏ మాత్రం తెలుగు బాషా దినోత్సవాన్ని అశ్రద్ద చేయలేదు.అత్యంత వైభవంగా తెలుగు బాషా దినోత్సవాన్ని జరుపుకుని తమ మాత్రు భాషపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

 telugu Laungauage Day Celebrated In Arab Country , Arab Country, Telugu Laungaua-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే అరబ్బు దేశమైన ఖతర్ లో తెలుగు భాషాభివృద్ది కోసం, తెలుగు ప్రవాసుల పిల్లలకు తెలుగును నేర్పించడం కోసం అలాగే తెలుగు పండుగలు, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను భవిష్యత్త్ తరాలకు అందించడం కోసం ఎంతగానో కృషి చేస్తోంది ఖతర్ లోని ఆంధ్రకళా వేదిక.ఎప్పటిలానే ప్రతీ ఏటా తెలుగు బాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది.

గిడుగు రామ్మూర్తి 159 వ జయంతి సందర్భంగా ఖతర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఎంతో అలరించింది.ఈ కార్యక్రమానికి తెలుగు భాషా పండితులు , తెలుగు బాషాభిమానులు హాజరయ్యారు.

ఆంధ్ర కళా వేదిక అద్యక్షులు భాగవతుల వెంకప్ప మాట్లాడుతూ ఉచితంగా తెలుగు బాషా తరగతులు, తెలుగు బాషా దినోత్సవాలను నిర్వహిస్తూ తెలుగు వెలుగుల కోసం ఖతర్ లో కృషి చేస్తూ తెలుగు దనం నింపుకున్న ఏకైక సంస్థ ఆంధ్ర కళా వేదిక ఉండటం తమకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమానికి ఖతర్ లో ఉన్న తెలుగు వారు పెద్ద సంఖ్యలో హాజరవ్వడం ఎంతో సంతోషంగా ఉందని విచ్చేసిన తెలుగు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలాఉంటే తెలుగు బాషా దినోత్సవం సందర్భంగా పిల్లలకు నిర్వహించిన పలు అంశాలపై పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు.పిల్లలకు ఆశీస్సులు అందిస్తూ తెలుగును తమ పిల్లలకు నేర్పించాలని ముందుకు వచ్చిన తల్లి తండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube