థైరాయిడ్.పురుషుల కంటే స్త్రీలలో అత్యధికంగా కనిపించే సమస్యల్లో ఇది ఒకటి.
గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండేదే థైరాయిడ్ గ్రంథి.ఈ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్ శరీర మెటబాలిక్ యాక్టివిటీలను కంట్రోల్‌లో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే ఈ హార్మోన్ ఉత్పత్తిలో హెచ్చు, తగ్గులు ఏర్పడటమే థైరాయిడ్.ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, అయోడిన్ లోపం, పలు రకాల మందుల వాడకం, పోషకాల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల థైరాయిడ్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొంత మందికి వారసత్వంగా కూడా ఈ సమస్య వస్తుంది.అయితే థైరాయిడ్ బాధితులు మందులతో పాటుగా.పలు ఆహార జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఉంటుంది.ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలకు థైరాయిడ్ పేషంట్స్ దూరంగా ఉండాల్సి ఉంది.
మరి ఆహారాలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
థైరాయిడ్ తో బాధ పడే వారు.
కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, చాక్లెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి.ఎందుకంటే, వీటిలో ఉండే కెఫిన్ థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపి.
సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.అలాగే థైరాయిడ్ ఉన్న వారు.
క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, పాలకూర, బ్రొకోలి వంటి ఆకుకూరలను తీసుకోవడం తగ్గించాలి.
అలాగే సోయా గింజలు, సోయా పాలు కూడా తీసుకోరాదు.ఎందుకంటే, సోయా ప్రోడెక్ట్స్‌లో ఉండే పలు పోషకాలు.థైరాయిడ్ హార్మోన్ పై దుష్ప్రభావం చూపుతాయి.
ముల్లంగి, స్ట్రాబెర్రీస్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ఫ్రైడ్ చికెన్, బట్టర్, షుగర్ లేదా షుగర్‌తో తయారు చేసిన స్వీట్స్, రెట్ మీట్ వంటి ఆహారాలు కూడా థైరాయిడ్ పేషంట్స్‌కు మంచివి కావు.కాబట్టి, ఈ ఆహారాలతో జర జాగ్రత్తగా ఉండండి.