నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి స్పందించారు.
ఫోన్ ట్యాపింగ్ వేరు, ఫోన్ రికార్డింగ్ వేరని స్పష్టం చేశారు.ఇద్దరు మాట్లాడుకుంటున్న వ్యాఖ్యలను ఎవరో మూడో వ్యక్తి రికార్డ్ చేస్తే దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు.
కోటంరెడ్డి పార్టీ మారాలనుకుంటే మారొచ్చు కానీ ఇలాంటి ఆరోపణలు సరికాదని వెల్లడించారు.







