మానవ శరీరంలో ఉండే అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి.ఇవి శ్వాస ప్రక్రియలో పాల్గొంటాయి.
ఇది మనం పీల్చుకునే ఆక్సిజన్ ను అన్ని అవయవాలకు చేరేలా చేస్తుంది.కాగా ఊపిరితిత్తులకు ఏదైనా సమస్య కలిగితే మిగతా అవయవాలకు సరఫరా ఈ విధానంలో మార్పు వచ్చి అవయవాలు దెబ్బతింటాయి.
కాబట్టి ఈ అవయవాలు ఊపిరితిత్తుల సమక్షంలో ఉన్నందున ఊపిరితిత్తులకు కొన్ని ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మనం రోజూ తీసుకునే నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
అంతేకాకుండా నీటిని పరగడుపున బాగా వేడి చేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.ఆహారం తీసుకునే సమయంలో కాకుండా మిగతా సమయంలో నీటిని బాగా తీసుకోవాలి.
ఇదియే కాకుండా శరీరానికి వ్యాయామం అవసరం.దానివల్ల అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి.
మనం తీసుకునే ఆహార పదార్థాలలో నూనె ను తక్కువగా వాడుకోవాలి.ఇతర పదార్థాలతో చేసిన నూనె కంటే కొబ్బరి నూనె ఎంతో మేలు అని వైద్యులు తెలిపారు.దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.అంతేకాకుండా నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు.ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, ట్రాన్స్ ఫ్యాట్స్ పదార్ధాలకు దూరంగా ఉండాలి.
ముఖ్యంగా ధూమపానం ,మద్యపానం అలవాటు ఉన్న వాళ్లు వెంటనే మానివేయడం మంచిది.దీనివల్ల అన్ని అవయవాలు ప్రమాదానికి గురి అవుతాయి.మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఎక్కువగా తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
మనం తీసుకునే ఆహార పదార్థాలలో ప్రోటీన్లు ఉండేటట్టు చూసుకోవాలి.ముఖ్యంగా పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు, మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది.
ఎక్కువగా కాయగూరలు, ఆకుకూరలను, పండ్లను తీసుకుంటే ఊపిరితిత్తులకు శక్తి అధికంగా ఉంటుంది.ఎక్కువగా ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను తీసుకోవాలి.పండ్ల జ్యూసులు ఎక్కువగా తాగాలి.అంతేకాకుండా రోగనిరోధకశక్తి కోసం మిరియాలు, వెల్లుల్లి, అల్లం, పసుపు, తులసి ఇలాంటి మరిన్ని పదార్థాలు తీసుకోవడం మంచిది.