తినే పండ్ల పైన ఉప్పు చల్లుకుని తింటున్నారా ? అయితే మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే...

చాలా మంది కొన్ని పండ్లు తినేటప్పుడు వాటిని కోసి ఉప్పు చల్లుకునే అలవాటు ఉంటుంది.మరికొందరి ఏ పండ్లయినా సరే ఉప్పు చల్లుకునే తింటారు.

 Is It Harmful To Have Fruits With Salt-TeluguStop.com

పండ్ల పైన ఉప్పు చల్లుకుని తినడం వల్ల పండు యొక్క రుచి ఇంకా బాగా ఉంటుందని కొందరి అభిప్రాయం.పండ్ల పైన ఉప్పు చల్లుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని మరికొందరి ఆలోచన.

పండ్ల పైన ఉప్పు చల్లుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా , నష్టాలున్నాయా తెలుసుకోండి.

పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల పండ్ల రుచి పెరగడమే కాదు పండ్లపై ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.అలా అని అన్ని పండ్లముక్కల మీద ఉప్పు చల్లుకుని తినడం కరెక్ట్ కాదు.పండ్లముక్కలపై ఉప్పు చల్లడం వల్ల బ్యాక్టీరియాను నాశనం చేయొచ్చు.

కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది కాదు.అయితే ఉప్పు ఎక్కువగా చల్లుకుంటే మాత్రం గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సిట్రస్ జాతి పండ్ల మీద ఉప్పు చల్లుకుని తింటే కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిరోధించవచ్చు.దీంతో అజీర్తి సమస్యలకు చెక్ పెట్టినట్టవతుంది.

జామకాయ మీద ఉప్పు చల్లుకుని తింటే దంతాలకు ఎంతో మేలు జరుగుతుంది.నోటిలోని బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

ఎక్కువగా ఉప్పు చల్లుకుని తినే పండ్లలో పుచ్చకాయ , మామిడి కాయ , జమ కాయ లతో పాటు దోసకాయలు తింటారు.అయితే వేసవి లో ఎక్కువగా పుచ్చకాయలు , దోసకాయలు ఉప్పు చల్లుకుని తినడం వల్ల మంచి రుచి తో పాటు శరీర అలసత్వం కూడా పోగొడుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube