కులాంతర వివాహం చేసుకుందని దారుణమైన శిక్ష

దేశంలో అంతరానితం, కుల వివక్షఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే కుల వివక్ష అప్పుడప్పుడు పడగ విప్పి బుసలు కొడుతూ ఉంటుంది.

 Inter Caste Marriage Women Facing Harassment-TeluguStop.com

ఇప్పుడు అలాంటి ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబువా జిల్లాలోని భోపాల్‌కు 340 కి.మీటర్ల దూరంలో చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దేవిఘర్‌లో ఓ మహిళ ప్రేమించి వేరొక కులానికి చెందని వ్యక్తితో వివాహం చేసుకుంది.అయితే దీనిపై ఆగ్రహించిన పెళ్ళికొడుకు కులానికి చెందిన వారు, ఆ మహిళపై వివక్షాపూరితంగా వ్యవహరించారు.

భర్తను భుజాలపై మోసుకెళ్లాలని ఆమెకి శిక్ష విధించారు.దీనితో ఆమె చేసేది ఏమి లేక భర్తను మోసుకెళ్లింది.

నడవడానికి ఇబ్బంది పడుతున్నా వారు కనికరించకుండా డ్యాన్సులు చేస్తూ పైశాచిక ఆనందం వ్యక్తం చేసారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి కేసును నమోదు చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube