జ్యూస్ లో ఇది కలిపారాంటే.. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం..

హార్ట్ ఎటాక్ కారణాలు అన్ని ఇన్ని అని కచ్చితంగా చెప్పలేము.అంటే దీనికి అర్థం హార్ట్ ఎటాక్ ఎన్నో రకాలుగా వస్తూ ఉంటుంది.

 If You Mix It In Juice.. There Is A Risk Of Heart Attack, , Heart Attack, Sugar-TeluguStop.com

అయితే మనం తీసుకునే ఆహారం కూడా ఇందుకు ఒక కారణమని చెప్పవచ్చు.ఇక తాజాగా హార్ట్ ఎటాక్ కారణమయ్యే మరో విషయం శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.

మనం తీసుకునే జ్యూస్ లో షుగర్ కలిపినా కూడా హార్ట్ ఎటాక్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే స్వీట్స్ ఎక్కువగా తీసుకున్న కూడా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలలో తెలిసింది.

BMC మెడిసిన్ జనరల్ లో ప్రచురించబడిన పరిశోధనలలో చక్కెర వినియోగాన్ని మొత్తం డైలీ ఎనర్జీతో ఐదు శాతం కంటే తక్కువగా తగ్గించాలని సూచించారు.అయితే మొత్తం కార్బోహైడ్రేట్ తీసుకోవడానికి గుండె సంబంధిత వ్యాధులకు సంబంధం లేదని అధ్యయనంలో తెలిసింది.

Telugu Carbohydrates, Tips, Heart Attack, Heart, Sugar Level-Telugu Health

అయితే వినియోగించే కార్బోహైడ్రేట్ల రకాలు, సోర్స్ లను పరిశీలించినప్పుడు షుగర్ పానీయాలు, పండ్ల రసాలు, స్వీట్స్ వంటి ఆహారాల నుంచి ఎక్కువగా ఫ్రీ షుగర్ ను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.మనం తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయి ఐదు శాతానికి మించితే మొత్తం గుండె సంబంద వ్యాధుల ప్రమాదం 7% పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Telugu Carbohydrates, Tips, Heart Attack, Heart, Sugar Level-Telugu Health

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఆరు శాతం ఎక్కువగాను, స్టోక్ వచ్చే ప్రమాదం 10% ఎక్కువగానే ఉంటుందని నిపుణులు గుర్తించారు.రోజుకు 5 గ్రాముల ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వలన మొత్తం గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం నాలుగు శాతం తగ్గుతుంది.ఫ్రీ షుగర్ ను నాన్ ఫ్రీ షుగర్ తో రీప్లేస్ చేయడం వల్ల గుండె సంబంధ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అలాగే అధిక ఫైబర్ ఉన్నవి తీసుకోవడం వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube