ఈ మధ్య కాలంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, హీరో కళ్యాణ్ దేవ్ విడాకులకు సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.శ్రీజ మూడో పెళ్లి గురించి కూడా సోషల్ మీడియా, వెబ్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
చిరంజీవి కూతురు కావడం వల్లే శ్రీజ గురించి ఈ స్థాయిలో ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది.సోషల్ మీడియాలో శ్రీజ భర్త పేరును తొలగించినప్పటి నుంచి ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
కళ్యాణ్ దేవ్ సినిమాలను మెగా ఫ్యామిలీ పట్టించుకోకపోవడం కూడా వైరల్ అయిన వార్తల్లో నిజం ఉండవచ్చని చాలామంది నమ్మడానికి కారణమయ్యాయి.అయితే ప్రముఖ నిర్మాత చిట్టిబాబు వైరల్ అయిన వార్తల గురించి స్పందిస్తూ ఆ వార్తల గురించి క్లారిటీ ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేశారు.
వ్యక్తిగత విషయాలను తెలియజేయడం పూర్తిస్థాయిలో తప్పు అని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.
ఒక అమ్మాయి వృత్తికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవచ్చని అయితే వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను మాత్రం సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం సరి కాదని చిట్టిబాబు కామెంట్లు చేశారు.
శ్రీజ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం వల్లే ఈ తరహా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని చిట్టిబాబు కామెంట్లు చేయడం గమనార్హం.

సోషల్ మీడియాలో శ్రీజ భర్త పేరును తొలగిస్తే విడాకులు తీసుకుంటోందని ఎలా భావిస్తారని చిట్టిబాబు ప్రశ్నించారు.భర్త అనుమతితోనే శ్రీజ భర్త పేరును తొలగించి ఉండవచ్చని చిట్టిబాబు అన్నారు.పని, పాట లేని గాడిదలు వార్తలు సృష్టిస్తూనే ఉంటారని అలాంటి వార్తల గురించి స్పందించాల్సిన అవసరం లేదని చిట్టిబాబు కామెంట్లు చేశారు.
శ్రీజ పెళ్లికి సంబంధించిన వార్తలు మెగా ఫ్యాన్స్ కు సైతం చిరాకు తెప్పిస్తుండటం గమనార్హం.







