అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పట్టుకుంటే ఓ పట్టాన వదలరనేది జగమెరిగిన నగ్నసత్యం.తాజా ఆయన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.
ఇద్దరి మధ్య అతి సన్నిహితం ఉన్న విషయం తెలిసిందే.మరి ఇద్దరికీ ఎందుకు, ఎక్కడ చెడిందో అర్దికాని పరిస్థితుల్లో ఉన్న జనాలకు.
ఇపుడు మిత్రలాభం కాస్తా మిత్ర బేధంగా మారినట్లు పుకార్లొస్తున్నాయి.అందుకు తాజాకారణం కూడా ఇద్దరి మద్య ముదిరిన మాటల యుద్ధం.
ట్రంప్, ఎలన్ మస్క్ ల మద్య వివాదం ముదిరింది.మాటల యుద్ధంలో ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు.
సబ్సిడీల కోసం మస్క్ అభ్యర్థించాడన్న డొనాల్డ్ ట్రంప్.ట్రంప్ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైనందన్నారు ఎలన్ మస్క్ అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ తనకే ఓటు వేసినట్టు అబద్ధమాడాడని ట్రంప్ వ్యాఖ్యానించడంపై ఎలన్ మస్క్ స్పందించారు.
రిపబ్లిక్ పార్టీ అనుకూలవాదిగా మస్క్ కు మంచి పేరుంది.మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయనున్నట్టు డీల్ ప్రకటన వెలువడిన తర్వాత ఆయను ట్రంప్ ప్రసంశల్లో ముంచెత్తారు.
ట్రంప్ ను ట్విట్టర్ నిషేధించడాన్ని మస్క్ లోగడ తప్పుబట్టారు.ఇవన్నీ వీరి స్నేహానికి ఐడెంటిఫికేషన్లయితే.ప్రస్తుతం వీరి మధ్య ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి.

తాజాగా ట్రంప్ ఎలన్ మస్క్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మస్క్ వైట్ హౌస్ వచ్చి ,సబ్సిడీలతో నడుస్తున్న తన చాలా ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరినట్లు తెలిపారు.అయితే ట్రంప్ కామెంట్స్ పై స్పందించిన మస్క్ రీ కౌంటర్లు ఇచ్చారు.
ట్రంప్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ మస్క్ అభివర్ణించారు.ట్రంప్ మాటలకు తాను అసహ్యించుకోవడం లేదన్నారు.
మాజీ అధ్యక్షుడు కావడంతో కాస్త మాటల్లో మార్పు కనిపిస్తుందంటూ ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు.మళ్లా ఆయన కుదుట పడాలంటే అధ్యక్షుడు కావాలంటూ ట్విట్ చేసారు.







